
వరుస సినిమాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకేసారి రెండు షూటింగ్ లు చేస్తూ ఫాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ కాగా ప్రస్తుతం ఏకే రీమేక్, హరిహర వీరమల్లు చిత్రాల్లో ఒకేసారి నటిస్తూ అబ్బురపరుస్తున్నాడు.. హరిహర వీరమల్లు గా పవన్ లుక్ మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయ్యింది. ఈ లుక్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కింది..
హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ లుక్ లో ఓ రేంజ్ లో ఉన్నాడని అభిమానులు తెగ పొగిడేశారు... చారిత్రాత్మక లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని సోషల్ మీడియా లో తెగ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియా పవన్ ఫాన్స్ హంగామా తగ్గలేదు.. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా టైటిల్ ని కూడా ఈ లుక్ లో రివీల్ చేశారు.

ఈ సినిమా బడ్జెట్ లో దాదాపుగా 50 కోట్లకు పైగా గ్రాఫిక్స్ కోసం కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మించడంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ను కూడా ఎక్కువగా ఈ సినిమా కోసం వినియోగించబోతున్నారు. హరి హర వీరమల్లు సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం 50 కోట్లు ఖర్చు చేస్తూ ఉండగా మరో రూ.50 కోట్లను పవన్ కళ్యాణ్ పారితోషికంగా ఇస్తున్నారట. సినిమా బడ్జెట్ లో పవన్ బడ్జెట్ మరియు వీఎఫ్ఎక్స్ కోసమే వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారనే సమాచారం అందుతోంది. షూటింగ్ పూర్తి అయ్యేప్పటికి సినిమా బడ్జెట్ మరింతగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.