యాంకర్ రష్మీ తో రొమాన్స్ కి సిద్ధమయిన శేఖర్ మాస్టర్..?

వెండితెరపైనే తన స్టెప్పులతో అదరగొడుతున్న శేఖర్ మాస్టర్ బుల్లితెరపైన కూడా జడ్జ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కొరియోగ్రాఫర్ లలో ఆయనే టాప్ డ్యాన్స్ మాస్టర్.. రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు.. ప్రస్తుతం స్టార్ హీరోలకు ఈయనే ఎక్కువ డాన్స్ మాస్టర్ గా ఉంటున్నారు. చిరంజీవి దగ్గరి నుంచి చిన్న హీరో దాకా శేఖర్ మాస్టర్ అందరికి కావాల్సిందే.. కనీసం సినిమాలో ఒక్క పాటకైనా శేఖర్ స్టెప్పు ఉండాల్సిందే..

సినిమాల్లో తన హవా ను చూపిస్తున్న శేఖర్ మాస్టర్ బుల్లితెరపైనా కూడా తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. తొలుత డాన్స్ షో కి జడ్జ్ గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత కామెడీ షో కి జడ్జ్ గా చేస్తూ అందరిని అలరిస్తున్నారు.. బుల్లతెరపై అయన వేసే పంచ్ లకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు.. ఇక అయన హీరోగా తెరంగేట్రం చేయనున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా ఈ వార్త హల్చల్ అవుతుండడమే కాకుండా యాంకర్ రష్మీ కూడా ఆయనతో రొమాన్స్ కి సిద్ధమవుతుంది అంటున్నారు.

ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు బుల్లితెరపై అదిరిపోయే ఇమేజ్ ఉంది. ఢీ ఛాంపియన్స్‌తో పాటు మరిన్ని షోల్లో కూడా రష్మీ, శేఖర్ మాస్టర్ జోడీ ఆకట్టుకుంటుంది. దాంతో ఇప్పుడు ఈయన్ని హీరోగా పరిచయం చేయబోతున్న సినిమాలో ఈమెనే హీరోయిన్‌గా తీసుకుంటే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రష్మీకి కూడా శేఖర్ మాస్టర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి పెద్దగా ఇబ్బందులేం లేనట్లే కనిపిస్తుంది. శేఖర్ మాస్టర్‌కు ఇమేజ్ బాగానే ఉంది కాబట్టి ఆయన్న హీరోగా పరిచయం చేయడానికి నిర్మాతలు కూడా బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. మరి  డ్యాన్సర్ గా జడ్జ్ గా అలరించిన శేఖర్ మాస్టర్ హీరోగా ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.