14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి అచంట నిర్మాతలుగా వ్యవహరిస్తూ శర్వానంద్, “గ్యాంగ్ లీడర్” ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. కిషోర్.బి అనే యువ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇటివలే టీజర్ రీలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి విశేష స్పందన సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంభందిచి ఫోక్ మెలోడీ “భలేగుంది బాలా” సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ సాంగ్ కి లిరిక్స్ పెంచల్ దాస్ అందించగా మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సంప్రదాయంగా లంగావోణీలో సూట్ కేస్ తీసుకుని వెళ్తున్న హిరోయిన్ ప్రియాంక మోహన్ ని చూసి హిరో శర్వానంద్ పాట మొదలుపెడతాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో విడుదలై ట్రెండింగ్ అవుతూవుంది. ఈ పాటను పెంచల్ దాస్ పాడడం విశేషం. గతంలో పెంచల్ దాస్ రచించి పాడిన పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. అలాగే ఈ పాటకి, సినిమాకి విపరీతమైన క్రేజ్ సంపాదించింది. హీరో శర్వానంద్ ఈ పాటను తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా విడుదల చేశారు. శర్వానంద్ ఈ పాట గురించి చెప్తూ ఈ పాట గురించి మీరు ఏం అనుకుంటున్నారో చెప్పండి అంటూ సాంగ్ లింక్ షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు.