
శర్వానంద్ హీరోగా సిద్ధార్థ్ కీలక పాత్రలో అదితి రావు హైదరి, అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్ లు గా నటిస్తున్న చిత్రం మహాసముద్రం. RX100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి ఈ సినిమా తో భారీ అంచనాలు నెలకొనేలా చేశాడు. గత కొన్ని సినిమాలుగా హిట్ లు లేని శర్వానంద్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా సమయమే పట్టింది. ఇక రెండు ప్రధానమైన పాత్రలకు హీరోలు సెట్ కావడానికి కూడా టైమ్ పట్టింది. అందువల్లనే ఆయన షూటింగు విషయంలో ఆలస్యం చేయలేదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా షూటింగు కానిచ్చేశాడు.

ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఆయన ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ను కలుపుకుంటూ సాగే కథ ఇది. పాత్రల మధ్య సున్నితమైన భావోద్వేగాల ఘర్షణ .. సంఘర్షణ కనిపిస్తాయి.ఇక ఒక కీలమైన పాత్రను జగపతిబాబు పోషించగా, ప్రతినాయకుడి పాత్రలో 'గరుడ' రామ్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.