
మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తర్వాత వరుస సినిమా లు చేస్తున్నాడు. మూడు సినిమాలు ఒకేసారి పట్టాలెక్కించనున్నాడు.. వాటిలో రెండు రీమేక్ సినిమాలు కాగా, ఇంకోటి స్ట్రైట్ తెలుగు సినిమా.. ఆచార్య విడుదల కు సిద్ధం గా ఉన్న నేపథ్యంలో చిరు వీటిలో ముందుగా లూసిఫర్ రీమేక్ ను సెట్స్ మీద కు తీసుకెళ్ళబోతున్నాడు.. ఈ సినిమా కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు..

ఈ సినిమా కథ పూర్తి కాగా ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది.. ఇందులో కథానాయికగా నయనతార ను సంప్రదించారు. తమిళనాట నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడి స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఆమెకి ఉంది. నాయిక ప్రధానమైన కథలను రెడీ చేసినవారు ముందుగా నయనతారనే సంప్రదిస్తూ ఉంటారు. నయనతార ఉంటే చాలు అక్కడి సినిమాలకు బిజినెస్ పరంగా ఎలాంటి సమస్య ఉండదు. తమ సినిమాను ఆమెతోనే చేయాలనే ఉద్దేశంతో వెయిట్ చేసే దర్శక నిర్మాతలు చాలామందినే ఉన్నారు. ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి ఆనందంగా అంగీకరిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే మలయాళంలో మంజూ వారియర్ చేసిన పాత్ర కు ఈ చిరంజీవి సినిమా కు అడిగారు. అయితే తన పోర్షన్ ను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని నయనతార అందనీ, అందుకు మేకర్స్ అంగీకరించారని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.