సెన్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ చేతుల మీదుగా `క‌ర‌ణ్ అర్జున్‌` ఫ‌స్ట్ లుక్ లాంచ్‌!!

ఇటీవ‌ల కాలంలో కంటెంట్ న‌చ్చితే చాలు కొత్త‌వారా,  పాతవారా అని చూడ‌కుండా సినిమాలు స‌క్సెస్ చేస్తున్నారు ఆడియ‌న్స్ .  ఆ కోవ‌లో కంటెంట్ ని మాత్ర‌మే న‌మ్ముకుని వస్తోన్న    రోడ్ థ్రిల్ల‌ర్  `క‌ర‌ణ్ అర్జున్‌`.   రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై  అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించ‌గా ఈ చిత్రానికి   మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాత‌లు.   ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌.   ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్  లాంచ్ ఈ రోజు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చేతుల మీదుగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ మాట్లాడుతూ...``క‌ర‌ణ్ అర్జున్‌` టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ద‌ర్శ‌కుడు స్టోరి లైన్ కూడా చెప్పారు...ప్ర‌జంట్ ట్రెండ్ కి క‌నెక్ట‌య్యే స్టోరి. టీమ్ అంద‌రూ కూడా ఎంతో ప్యాష‌న్ తో సినిమా తీసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు.



చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స మాట్లాడుతూ....``మా సినిమా ఫ‌స్ట్ లుక్ ప‌ర‌శురామ్ గారు లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. వారికి నా ధ‌న్య‌వాదాలు.  ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని లొకేష‌న్స్ లో  పాకిస్థాన్ బార్డ‌ర్ లో ఎంతో రిస్క్ తీసుకుని  మా సినిమా  షూటింగ్ చేశాం.  మూడు పాత్ర‌ల‌తో ఊహించని మ‌లుపుల‌తో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఉత్కంఠ‌భ‌రితంగా సాగే రోడ్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే ఎమోష‌న్స్ ఉన్నాయి.  ఈ సినిమా ఇంత క్వాలిటీగా రావ‌డానికి మా నిర్మాత‌లే కార‌ణం. వారు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నాకు పూర్తి స్వేచ్ఛ‌నివ్వ‌డంతో అనుకున్న‌ట్లు గా తీయ‌గ‌లిగాను. మా నిర్మాత‌లంద‌రికీ పేరు పేరునా నా ధ‌న్య‌వాదాలు.  సినిమా ఫ‌స్ట్ కాపీ రెడీ అయింది. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం`` అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ర‌వి మేక‌ల మాట్లాడుతూ...``ఎంతో బిజీగా ఉన్నా డైర‌క్ట‌ర్ ప‌ర‌శురామ్ గారు టైమ్ ఇచ్చి మా సినిమా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసినందుకు వారికి కృత‌జ్ఞ‌త‌లు.  రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ బేన‌ర్ పై రూపొందిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నెం-1 చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`.  డైర‌క్ట‌ర్ మోహ‌న్ గారు  డిఫ‌రెంట్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నేను ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ తో పాటు కొరియోగ్రఫీ కూడా చేశాను. ఇందులో రెండు పాట‌లున్నాయి. ఒక పాట కశ్మీర్ లో చేశాం. మ‌రో పాటు రాజ‌స్థాన్ లో చేశాం.  ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా ఎంతో రిచ్ గా రావడానికి స‌హ‌క‌రించిన మా నిర్మాత‌ల‌కు థ్యాంక్స్ `` అన్నారు.



అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా , మాస్ట‌ర్ సునీత్ , అనిత  చౌదరి, రఘు . జి,  జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి  ఫైట్స్ : రామ్ సుంకర;
ఎడిటర్ : కిషోర్ బాబు; కాస్ట్యూమ్ డిజైనర్ : లతా మోహన్; మ్యూజిక్ : రోషన్ సాలూరి; పాట‌లుః సురేష్ గంగుల‌; కొరియోగ్రఫీ : రవి మేకల; డి .ఓ .పి : మురళి కృష్ణ వర్మన్;  పిఆర్వోః చందు ర‌మేష్ (బాక్సాఫీస్);
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి మేకల; ప్రొడ్యూసర్స్ :  డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల,
 సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్; కథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం : మోహన్ శ్రీవత్స.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.