
రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సంచలన విజయాన్ని సాధించింది. రామ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత ఆయన చేసిన 'రెడ్' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా రామ్ డీలాపడిపోకుండా తన తదుపరి సినిమాను వెంటనే లైన్లో పెట్టేశాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. రామ్ సరసన నాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు.

ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసింది కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా కి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.. ఈ సినిమా కోసం విలన్ ని వెతికే పనిలో సినిమా బృందం వారికి సమాధానంగా మాధవన్ కనిపించాడట. రామ్ కి విలన్ గా మాధవన్ అయితే బాగుంటుందన్న ఆలోచన చేసి ఆయనను ఎంపిక చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట.

ఎలాగోలా ఈ వార్త బయటకి రావడంతో రామ్ అభిమానులు మాధవన్ ని విలన్ గా ఎంపిక చేయవద్దు అని లింగుస్వామి కి సూచిస్తున్నారట. మాధవన్ ఇప్పటివరకు చేసిన రెండు తెలుగు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. సవ్యసాచి, నిశ్శబ్దం సినిమాలు ఘోర పరాజయం పాలవడంతో రామ్ సినిమా లో విలన్ గా మాధవన్ వద్దని చెబుతున్నారు