
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని వారుండరేమో. కానీ డైరెక్టర్ గా కొంతమందికే తెలుసు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా చాలామందికి తెలుసు.. అప్పుడెప్పుడో చేసిన శివ సినిమా ఇప్పటికీ కొన్ని సినిమాలకు ఆదర్శంగా నిలుస్తుంది.. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ కాగా ఆ సినిమా ను రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ చెప్పుకుని సినిమా ఆఫర్స్ కొట్టేస్తున్నాడంటే ఆశ్చర్య పోనవసరంలేదు. ఇప్పుడు ఆ వచ్చే ఛాన్స్ లు కూడా వర్మ కి రావట్లేదు.. గమనిస్తే గత కొన్ని రోజులనుంచి ఆయననుంచి సినిమాలు అస్సలు రావట్లేదు..

శివ తర్వాత సరిగ్గా సినిమాలు చేయక వివాదాలతో కాపురం చేస్తున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అయన ఇప్పుడు ఏది చేసినా సంచలనమే అవుతుంది... ట్విట్టర్ వేదికగా అయన చేసే హంగామా అంత ఇంతా కాదు.. ఊరికూరికే అందరిని టార్గెట్ చేస్తూ పిచ్చి కూతలు కూయడమే పనిగా పెట్టుకున్నాడు. ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ పెడుతూ, ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు. దానికి తోడు యూట్యూబ్ ఛానళ్లలో కామెంట్స్ చేస్తూ పాపులర్ అవుతుంటారు.

ఇక అయన ఇండస్ట్రీ కి పరిచయం చేసిన హీరోయిన్ అప్సర రాని తాజగా ఐటెం సాంగ్ లు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే.. క్రాక్ సినిమా లో ఐటెం సాంగ్ చేసిన ఆమె తాజగా సిటమార్ సినిమాలోనూ ఐటెం భామగా చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ - మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న సినిమా సీటీమార్. ఇటీవల ఈ సినిమా నుంచి జ్వాలా రెడ్డి అన్న సాంగ్ రిలీజై అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సీటీమార్ సినిమా నుంచి మరో సాంగ్‌ని రిలీజ్ చేశారు. పక్కా మాస్ ఆడియన్స్ కోసమే మణిశర్మ మాంచి ఐటెం సాంగ్‌ని కంపోజ్ చేశారనిపిస్తోంది. నా పేరే పెప్సీ ఆంటీ అంటూ సాగే ఈ సాంగ్‌లో యంగ్ బ్యూటీ అప్సర రాణి స్టెప్పులేసింది. తాజాగా రిలీజైన ఈ సాంగ్ యూత్ అండ్ మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.