21వ సంవత్సరంలోకి ‘’సంతోషం’’ - అతి త్వరలోనే 2022 అవార్డ్స్ ఫంక్షన్!!

ఒక సినీ వారపత్రిక ఇరవై సంవత్సరాలు పూర్తిచేసుకొని, ఇరవయి ఒకటో వసంతంలోకి అడుగుపెట్టడం అసామాన్య విషయం కాకపోవచ్చు. కానీ అది చిన్న విషయం మాత్రం కాదు. ఆగస్ట్ 2వ తేదీతో 'సంతోషం'కు 20 ఏళ్లు నిండి 21వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. నేడు పత్రికా నిర్వహణ కత్తిమీద సాము వ్యవహారం, న్యూస్ ప్రింట్ ధరలు కొండెక్కి కూర్చున్న కాలంలో ఆర్థికంగా అది అత్యంత కఠిన పరీక్ష, ఈ పరీక్షలను, అవాంతరాలను, గండాలను తట్టుకోలేక ఎన్నో పత్రికలు కనుమరుగయ్యాయి. అయినా కాలానికి ఎదురీదుతూ, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుంటూ 'సంతోషం' దిగ్విజయంగా, చిద్విలాసంగా అడుగులు ముందుకేస్తూ వస్తోంది. సినీ వార పత్రికా రంగంలో ఇది అపురూప సందర్భం! ఈ సందర్బాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి 'సంతోష సురేష్ గా పేరు పొందిన వ్యక్తి- సురేష్ కొండేటి.

అవును, 'సంతోషం' సాధించిన విజయం వెసుకున్న మనిషి ఆయనే. ఎడిటర్, పబ్లిషర్ గా సంతోషం'ను తన మానస పుత్రికగా భావించి అపూర్వంగా, అపురూపంగా చూసుకుంటూ, దాని ఎదుగుదలను అమితంగా ఆస్వాదిస్తూ, ఎప్పటికప్పుడు కొత్త సొబగులను అద్దుతూ, ప్రతి సంచికనూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ, చిత్రసీమలో దానికొక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టారు సురేష్, అందుకే వారం వారం అందరూ ''సంతోషం’'గా చదువుతూనే ఉన్నారు. దాని కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వార పత్రికను తీసుకురావడమన్నది ఆ కొండకు, ఈ కొండకు కట్టిన తాడుపై పరుగెట్టుకుంటూ పోవటం వంటిది, అత్యంత సాహసోపేతమైంది? సురేష్ కొండేటి తన ''సంతోషం’'ను చూసుకునే విధానం బహు రమణీయం. చేతిలో పత్రిక ఉంది గదా అని దానిని అడ్డుపెట్టుకుని ఎవరిపైనా రాళ్లు చేయటానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. చేతిలో పత్రిక ఉంది అని దానిని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించలేదు. అది ఆయన నైజం కాదు తన పత్రిక ద్వారా అసలు ఏ ఒక్కరినీ నొప్పించడానికి ఒప్పుకోరు! అది ఆయన గుణం. తన సొంత పనులు, తన సొంత కార్యకలాపాలు.. అన్నీ తనవరకే పరిమితం. ఏనాడు, ఏ పరిస్థితిలోనూ పత్రికాముఖంగా ఎదుటి వాళ్లను తక్కువ చేయడానికి చూడలేదు. అది ఆయన మంచితనం.
నేటి జనరేషన్ కి తగ్గట్లు సురేష్ కొండేటి నిజాయితీకి నిలువెత్తు రూపం. అదే నిజాయితీని ఎదుటివాళ్ల నుంచీ ఆశిస్తారు. అలా అని ఆయన సత్తెకాలపు సత్తెయ్య కాదు. నేటి జనరేషన్ కి తగ్గట్లు ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. అందుకే ఇండస్ట్రీలోని చిన్నా, పెద్దా తేడా లేకుండా, సీనియర్లు జూనియర్లనే భేదం లేకుండా అందరూ సురేష్ కొండేటిని అభినందిస్తుంటారు. మరింత ఎదగాలని ఆశీర్వదిస్తుంటారు. సాధారణంగా ఇండస్ట్రీలోని కొద్ది మందిని 'అజాతశత్రువు"గా అభివర్ణిస్తుంటారు. నిస్సందేహంగా ఆ కొద్ది మందిలో సురేష్ కొండేటి ఉంటారు. ఆ విషయం ఇండస్ట్రీలోని వారంతా ఒప్పుకుంటారు. నిజానికి ఇండస్ట్రీలో సురేష్ కొండేటి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. మరెన్నో నష్టాలను చవి చూశారు. మరొకరైతే ఆ కష్టాలు, నష్టాలు, సమస్యలకు కుంగిపోయి కుదేలై పోతారు. తట్టాబుట్టా సర్దుకొని మరేదైనా లాభసాటి పనినో, వ్యాపారాన్నో చేపడతారు. కానీ సురేష్ కొండేటి ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చెదరదు! ఆ ముఖమే ఆయన. వ్యక్తిత్వం సురేష్ కొండేటిని చూసి అందరూ. 'ఎంత సంతోషకరమైన మనిషికి అనుకుంటారు, కొండొకచో అసూయపడుతుంటారు. సురేష్ కు రెండు హృదయాలున్నాయి! ఒక హృదయం నిండా తన కష్టనష్టాలు, బాధలు, కడగళ్లు.. వగైరా? మరో హృదయంలో 'సంతోషకరమైన జీవితాన్ని సాధించేందుకు అవసరమైన పాజిటివ్ ఎనర్జీ, మొదటి హృదయంలోని బాధలు రెండో దాన్లోకి రావు. అలా రాకుండా ఉండటానికి తన దైనందిక జీవితాన్ని ఎప్పుడూ నవ్వుతూ, ఎవరినీ నొప్పించక తానొవ్వక గడిపేస్తుంటారు. ఇది ప్రకృతి ఆయనకిచ్చిన వరం! ఎందుకో మరి ఇలాంటి వరం అందరికీ దక్కదు. ఆ వరాన్ని ప్రకృతి. అందరికీ ఇవ్వరనిపిస్తుంది. సురేష్ కు సహజంగా అబ్బిన ఒక గుణం.... మాట చాతుర్యం. ఆ చాతుర్యంతో చొచ్చుకుపోవటం! అందుకే ఈ సాధ్యంకాని అనుభవాన్ని, సీనియారిటీని, పరిచయాలను, ప్రాభవాన్ని అతి తక్కువ సమయంలోనే సంపాదించారు!!

అదే సురేష్ ఘనత
ఎన్ని కష్టాలనైనా పడి పత్రికను నిర్విరామంగా తీసుకురావచ్చు. ఏడాది వేడుకలను' అద్భుతంగా జరుపుకోవచ్చు. కానీ, వార్షికోత్సవ అవార్డుల వేడుకలను నిర్వహించడం ఒక అసామాన్యమైన విషయం. 'ఈ అవార్డుల వేడుకను కూడా సంతోషం వార్షికోత్సవ వేడుకలతో పాటు జరుపుతూ వస్తున్నారాయన. వార్షికోత్సవ వేడుకల కంటే అవార్డుల వేడుకలను ఘనంగా జరపటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ సురేష్ కి సాధ్యమైంది. అవార్డుల వేడుక అంటే హైదరాబాద్ ఇండస్ట్రీ లోని వాళ్ళను పిలిచి అవార్డులను ఇచ్చేయడం కాదు. దక్షిణాదిలోని నాలుగు భాషా చిత్రసీమలకు సంబంధించి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులను నిర్వహిస్తూ వస్తున్నారు. దక్షిణాది భాషల్లో సీనియర్ కళాకారుల్ని సాదరంగా పిలిచి వారిని సత్కరించడమనే అసాధ్యమైన కార్యక్రమాన్ని ఏటేటా సురేష్ కొండేటి బ్రహ్మాందంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిని బట్టి సురేష్ ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు. సురేష్ కొండేటి అలు పెరుగని శ్రామికుడు. అదే ఆయన విజయ రహస్యం.  కాక పోతే తెలుగునాట ఏ ఒక్క ఇతర పత్రికా నిర్వహించలేని (నిర్వహించలేక కొందరైతే మధ్యలోనే ఆపేశారు!) అవార్డుల వేడుకను సురేష్ తానొక్కడిగా ఇన్నేళ్లుగా నిర్వహిస్తూ రావడం సాధ్యపడేవా? ఒక ప్రాంతీయ పత్రిక తన వార్షికోత్సవంతో పాటు, అవార్డు వేడుకను ఇన్నేళ్లుగా నిర్వహించడం సురేష్ ప్రతిభా సామర్ధ్యాలకు నిఖార్సైన తార్కాణం. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోదు నిజాయితీ, నమ్మకం కూడా ఎడమలుగా నిలుపుకున్న సురేష్ కొండేటి అన్నిటా అగ్రస్థానంలో నిల్చుని విజయఢంకా మ్రోగిస్తున్నారు. సురేష్ కొండేటికి అదేనండీ మన 'సంతోషం' సురేష్.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.