

సమంత అక్కినేని ప్రారంభించిన ‘సాకి’ వరల్డ్ ఫ్యాషన్ డిజైన్ వెబ్ సైట్ ద్వారా కొత్త రకమైన దుస్తులని తన వెబ్ సైట్ లో పొందుపరుస్తుంది. మాములుగా ఉంటూనే స్టైల్ గా కనిపించే ఈ దుస్తులను సమంత ధరించి వాటిని ప్రమోట్ చేస్తుంది. ఇక సాకి వరల్డ్ నుంచి కొత్తగా వచ్చిన అల్లురా కలెక్షన్ లో చండేరి కుర్తాను సమంత ధరించి ఫోటో కి ఫోజు ఇచ్చారు. ఈ ఫోటోని సాకి వరల్డ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. మీలో వెలుగుని ఎప్పుడూ నింపుతూ ఉండండి అని క్యాప్షన్ తో ఫోటోని పోస్ట్ చేసారు. ఈ దుస్తులని సమంత దీపావళి సందర్భంగా ధరించింది. తెలుపు రంగులో గీతలు వచ్చి సహజంగా అలాగే అందంగా డ్రెస్ ఉంది. ఈ దుస్తులని పెళ్ళిళ్ళ సీజన్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. నటిగానే కాకుండా వ్యాపారం లో కూడా సమంత తన సత్తాని చాటుతోంది. అలాగే ఈ మధ్యనే అహలో యాంకర్ గా కూడా సామ్ జమ్ షోలో తన ప్రతిభని చూపించింది.