సమంత

తన క్యూట్ లుక్స్ తో, నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది సమంత అక్కినేని. ఆమె తెలుగు,
తమిళ చిత్రాలతో విశేషంగా పాపులర్ అయింది. సమంత తన మొదటి సినిమా ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ చిత్రంలో పోషించిన జెస్సి పాత్ర అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళంలో తెరకెక్కిన విన్నైతాండి వరువాయకు ఇది తెలుగు వెర్షన్. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది అన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషం ఏమిటంటే తన మొదటి హీరో నాగ చైతన్య, తన జీవితంలో కూడా హీరో అయ్యాడు. నాగ చైతన్యను 2017లో వివాహమాడింది సమంత.  ఈమె సినిమాల్లోకి వచ్చి దశాబ్దం గడిచింది.

ఈ దశాబ్ద కాలంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో భాగమైంది సమంత. నీతానే ఎన్ పొన్ వసంతం, ఈగ, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అ… ఆ, యూ టర్న్, సూపర్ డీలక్స్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించి టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. తన నటనకు ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది సమంత. సినిమాలు మాత్రమే కాకుండా సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటుంది. అంతే కాకుండా మహిళల అభ్యున్నతికి ఎంతో పాటుపడుతోంది సమంత. సామ్ అని తన అభిమానులు పిలిచే సమంత సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యూలేషన్ స్కూల్, హోలీ ఏంజెల్స్ ఆంగ్లో-ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్, చెన్నై లో ఆమె స్కూలింగ్ పూర్తయింది. ఇక స్టెల్లా మేరీస్ కాలేజ్, చెన్నైలో ఆమె డిగ్రీ పూర్తయింది.

పార్ట్ టైమ్ మోడల్ గా సమంత తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత సినిమాలు క్యూ కట్టడం మొదలుపెట్టాయి. రవి వర్మన్ మొదట సమంత చూసి తన సినిమాలో సైన్ చేసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ 2007లో మొదలైనా, ఏం మాయ చేసావే చిత్రం మొదట విడుదలైంది. ఈ చిత్రం తమిళంలో శింబు, త్రిష హీరో హీరోయిన్లుగా విన్నైతాండి వరువాయ పేరుతో విడుదలై అక్కడా సూపర్ హిట్ అయింది. గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. తన సింపుల్ లుక్స్, ముఖ కవళికలు, స్క్రీన్ ప్రెజన్స్, ఇలా అన్ని విభాగాల్లో సమంత తన ఫస్ట్ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. మరో రెండేళ్ల తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే నీతానే ఎన్ పొన్ వసంతం చిత్రంలో నటించింది. ఈ సినిమా తెలుగులో ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రంగా విడుదలైంది. ఈ సినిమాలో నాని హీరోగా నటించాడు.

ఏం మాయ చేసావే తర్వాత మోస్కోవిన్ కావేరీ, బృందావనం, దూకుడు చిత్రాల్లో నటించింది.
తన కెరీర్ స్టార్టింగ్ లోనే సమంత ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించడం
విశేషమే మరి. ఈ సినిమా తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఈగ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఎంపికైంది. సమంత ఆ తర్వాత బడా చిత్రాల్లో నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జబర్దస్త్, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య చిత్రాలు ఆమెను టాప్ స్థాయిలో నిలబెట్టాయి. 2014లో సామ్ కు ఏకంగా ఆరు రిలీజ్ లు ఉన్నాయి. మనం, ఆటోనగర్ సూర్య, అల్లుడు శీను, రభస, అంజాన్, కత్తి చిత్రాల్లో నటించింది. అలాగే ఎండ్రత్తుకుల్లా, తంగ మగన్ లో మెరిసింది.


సమంత మూడోసారి మహేష్ తో బ్రహ్మోత్సవం సినిమాకు పనిచేసింది. అంతే కాకుండా అ..ఆ, జనతా గ్యారేజ్, మెర్సల్, రంగస్థలం, మహానది, యూ టర్న్ చిత్రాల్లో కనిపించింది. మజిలీ, సూపర్ డీలక్స్, సీమ రాజా, ఓ బేబీ చిత్రాలు సమంతకు నటిగా చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. సమంత త్వరలో కాతు వాక్కుల రెండు కథల్ సినిమాలో నటించనుంది. గుణశేఖర్ రూపొందించనున్న మైథలాజికల్ డ్రామా శాకుంతలంలో టైటిల్ రోల్ లో నటించనుంది.  తన దశాబ్దం కెరీర్ లో సమంత ఎన్నో అవార్డులు గెలుచుకుంది. మొత్తంగా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకుంది. 2012లోనే ఆమెను రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. అందులో ఒకటి ఈగ చిత్రానికి కాగా మరొకటి నీతానే ఎన్ పొన్ వసంతం. ఈగ చిత్రానికే సినీ'మా' అవార్డు వరించింది. ఇక 2013లో ఏం మాయ చేసావే చిత్రంలో పెర్ఫార్మన్స్ కు గాను నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది. నీతానే ఎన్ పొన్ వసంతం చిత్రానికి గాను విజయ్ అవార్డును సొంతం చేసుకుంది సామ్. 2016లో ఆమె సౌత్ స్కోప్ లైఫ్ స్టయిల్ అవార్డును అందుకుంది.

ఈ అవార్డు సౌత్ ఇండియాలో ఫ్యాషన్ ఐకాన్ గా ఉన్నందుకు ఇచ్చారు. అలాగే సైమా సింగపూర్ లో యూత్ ఐకాన్ అవార్డును 2016లో అందుకుంది సమంత. రంగస్థలం సినిమాకు సైమా అవార్డు లభించింది. సామాజిక కార్యక్రమాలు అంటే సమంతకు ముందు నుండీ బాగా ఆసక్తి. ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను చేసింది. ఎండోర్స్మెంట్స్, ప్రోడక్ట్ లాంచ్, షాప్ ఓపెనింగ్స్ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని సమంత ప్రత్యూష ఫౌండేషన్ కు డొనేట్ చేస్తుంది. ఈ ఫౌండేషన్ మహిళలకు, పిల్లలకు మెడికల్ సపోర్ట్ ఇస్తుంది. హెమోఫిలియా అనే వ్యాధి గురించి ఈవెంట్ల ద్వారా అవేర్ నెస్ ను క్రియేట్ చేసింది ఈమె.ఆంద్ర హాస్పిటల్స్ సౌజన్యంతో వారానికి ఒక పసి బిడ్డ హాస్పిటల్ బిల్స్ లో మూడో వంతును సమంత భరిస్తానని అగ్రిమెంట్ చేసుకుంది. రెండో మూడో వంతును ఆంధ్ర హాస్పిటల్స్ స్వయంగా భరిస్తుంది. మిగిలినది తల్లిదండ్రులు పే చేయాల్సి ఉంటుంది.

2015 నవంబర్ లో ఆరు నెలల లోపు చిన్నారులకు ఫ్రీ వాక్సినేషన్ ను స్పాన్సర్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో హ్యాండ్ లూమ్ ను ప్రమోట్ చేయడం కోసం సమంత హ్యాండ్ లూమ్ చీరలను ధరించి ఫోటోషూట్ చేసి అవేర్ నెస్ ను క్రియేట్ చేసింది.  సమంత కు ఫుడ్ అంటే ప్రాణం. సుశి, పాలకోవా అంటే ఈమె చెవి కోసుకుంటుంది. హాలీవుడ్ నటి ఆడ్రీ హేపీబర్న్ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు అతిపెద్ద ఇన్స్పిరేషన్ అని తెలిపింది. ది సీక్రెట్ బై రోండా బైర్న్ అనే బుక్ తనకు ఫెవరెట్ అని ఒక సందర్భంలో రివీల్ చేసింది. న్యూట్రోజెనా,కోల్గేట్ బ్రాండ్లకు సౌత్ లో అంబాసడర్ గా వ్యవహరిస్తోంది సమంత. రీసెంట్ గా ఇండియన్ ఈ కామర్స్ బ్రాండ్ మింత్రాకు సౌత్ మొత్తంగా బ్రాండ్ అంబాసడర్ గా వ్యహరిస్తోంది సమంత.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.