
సోషల్ మీడియా వచ్చాక సెలెబ్రిటిలు వారి అభిమానులకు మరింత్త దగ్గరవుతున్నారు. సినిమాలకు సంబంధించి వర్కింగ్ స్టిల్స్, మెకింగ్ విడియోలు, తమ జిమ్ విడియోలు, ఇతర యాక్టివిటిలకు సంబంధించిన పోస్ట్ లు పెట్టి తమ అభిమానులను అలరిస్తున్నారు. “భానుమతి... ఒక్కటే పీస్ హైబ్రీడ్ పిల్ల” అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హిరోయిన్
సాయిపల్లవి. తెలుగు, తమిళ సినిమాల్లో సాయి పల్లవి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. తాజాగా సాయి పల్లవి తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ లో భాగంగా సాయిపల్లవి ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. ఈ మేరకు సాయి పల్లవి షూటింగ్ మధ్య లో దొరికిన ఖాళీ సమయంలో తనని చూడటానికి వచ్చిన చుట్టు పక్కల ఇళ్ళలోని
పిల్లలకు సరదాగా గోరింటాకు పెట్టారు. ఆ ఫోటోలను సాయి పల్లవి సోషల్ మీడియా లో పోస్ట్ చేయ్యగా దానికి సెలెబ్రెటీలు స్పందించారు. సాయి పల్లవి హ్యపీ క్లయింట్స్ అనే క్యాప్షన్ తో పోస్ట్ పెట్టారు. అభిమానులు బాగా స్పందించారు. సాయి పల్లవి పోస్ట్ చేసిన ఫోటోలను సమంత, అనుపమ లు షేర్ చేస్తూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. “సో క్యూట్“ అంటూ సమంత, “నువ్వు మంచి మనసున్న డార్లింగ్ ” అంటూ అనుపమ సాయిపల్లవిని పొగిడారు. ప్రస్తుతం సాయి పల్లవి లవ్ స్టోరి, విరాట పర్వం చిత్రాల్లలో నటిస్తున్నారు.