శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ కు సాయి మాధవ్ బుర్రా..!!

టాలీవుడ్ లో కొన్ని ఆసక్తికర కాంబినేషన్ లు ఇప్పుడు నెలకొంటున్నాయి. పరభాషా హీరోలు దర్శకులు మన టాలీవుడ్ దర్శకులతో, హీరోలతో సినిమాలు చేస్తూ కొంత వెరైటీ, కొత్తదనాన్ని చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడం వెరైటీ అయితే ప్రభాస్ బాలీవుడ్ దర్శకులతో సినిమా చేస్తున్నాడు. రామ్ చరణ్ కూడా తమిళ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు.  తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి మరింత ప్రాధాన్యత వుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని నిర్మిస్తుండడం ఇంకో విశేషం.

ఈ కోవలో ఇప్పుడీ చిత్రానికి మరో విశేషం తోడైంది. తెలుగులో భారీ చిత్రాలకు పనిచేస్తూ, స్టార్ రైటర్ గా పేరుతెచ్చుకున్న సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు. దీనిపై సాయిమాధవ్ స్పందిస్తూ, 'జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫొటో దిగితే ఈ జీవితానికి చాలనుకున్నాను. ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను..' అంటూ ఆనందంతో శంకర్, చరణ్, దిల్ రాజులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు.

ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే షూటింగును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కథానాయిక పేరును కూడా త్వరలో ప్రకటిస్తారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.