రామ్ చరణ్ బర్త్ డే వేడుకలో సాయి ధరమ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు..!!

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా వేడుకలు అంబరాన్నంటాయి. అభిమానుల సమక్షంలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు ముఖ్య అతిధులుగా ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నార్మల్ గా చిరంజీవి బర్త్ డే వేడుకలు ఈ విధంగా జరుగుతాయి.. కానీ రామ్ చరణ్ తేజ్ బర్త్ డే వేడుకలు ఇప్పుడు చేయడం విశేషం.. కాగా రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ ఈ కార్యక్రమంలో చాలా సందడి చేశారు.

అయితే ఈ కార్యక్రమం లో సాయి ధరమ్ తేజ్ కొన్ని కాంట్రవర్సీ లో స్టేట్మెంట్స్ చేశాడు. ఎప్పుడు కామ్ గా ఉంటూ తనపనితాను చేసుకుంటూ పోయే సాయి ధరమ్ తేజ్ ఎలాంటి వివాదాలకు వెళ్ళడు.. కానీ ఇప్పుడు ఇలా సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. మెగా హీరోలపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పై అయన సీరియస్ గా స్పందించారు. మాపైన మా ఫ్యామిలీపైన నెగిటివ్‌గా మాట్లాడారో వాళ్లు ఎవరో మీకు తెలుసు.. ఆ మహావృక్షం చిరంజీవి గారు. మాకు దారి వేసింది చిరంజీవి గారు. మమ్మల్ని నడిపించేది ఆయనే. ఎంతమంది మమ్మల్ని ద్వేషించినా తిట్టినా.. ఏం చేసినా మేం వాటిని పట్టించుకోకుండా మేం ఇచ్చేది ప్రేమ ఒక్కటే.. ప్రేమిస్తూనే ఉంటాము.

మెగా ఫ్యామిలీ ఎప్పుడూ అభిమానుల్ని ప్రేమిస్తూనే ఉంటుంది.. వాళ్లకి ప్రేమను ఇవ్వడం కోసమే ఉంది.. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్‌గా జరగడానికి కారణం మెగా ఫ్యాన్స్.. మీకు ఎప్పటికీ దాసులుగా ఉంటా.. జైహింద్’ అంటూ పవన్ తరహాలో ఊగిపోతూ తన శైలికి విరుద్ధంగా స్పీచ్ ఇచ్చి అభిమానుల్ని ఉత్సాహపరిచారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం రిపబ్లిక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వైష్ణవ్ తేజ్.. ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు.. ఇటు రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తో పాటు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తునందు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.