థియేటర్ల పరిస్థితి ఏంటి..? మళ్ళీ మూసి వేయనున్నారా!

కరోన కారణంగా లాక్డౌన్ విధించి సంవత్సరం పూర్తయ్యింది. నిత్యావసర వస్తువులు తప్పించి మిగితావన్నీ టోటల్ బంద్. షాపింగ్ మాల్స్, ముల్టిఫ్లెక్స్, థియేటర్స్, స్కూల్స్ అన్నీ మూసివేసారు. అంతలా ఆ మహమ్మారి అందరిని బయపెట్టింది. ఇల్లు కదిలి బయటకు వెళ్ళడం గగనం అయ్యింది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా థియేటర్స్ ఓపెన్ కాలేదు. రెంట్లు, కరెంట్ చార్జెస్ వీటికి బయపడి థియేటర్ యజమానులు కూడా వాటిని తెరవడానికి సంకోచించారు. చివరికి ప్రభుత్వం కరెంటు చార్జీలని రద్దు చేస్తామని చెప్పడంతో యజమానులు ఊరట పొంది థియేటర్లు తెరిచారు.

అప్పుడు కూడా కేవలం 50 శాతం సీటింగ్ తోనే పరిమితి ఉంది. ఏ సినిమా అయినా ఏ థియేటర్ అయినా 50 శాతం టికెట్లు మాత్రమె అమ్మాలి. అలా చూసుకున్నా ఎంతో కొంత నష్టం అయితే వస్తుంది. థియేటర్లకు పరిమిషన్ వచ్చిన మొదట్లో ఆడిన సినిమాలు చాలా వరకు కలెక్షన్స్ ని రాబట్టాలేదు. దీంతో సినీ పెద్దలు అందరూ కలిసి ప్రభుత్వాన్ని 100 శాతం సీటింగ్ కి అనుమతించాలని కోరారు. ఈ విషయం మీద అందరితో చర్చించి దానికి ప్రభుత్వం ఒప్పుకుంది.

ఇక అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న టైమ్ లో మళ్ళీ కరోన పంజా విసురుతోంది. ఉన్నట్టుండి దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు ఎక్కువయ్యాయి. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దీనికి ముందస్తు చర్యగా ప్రభుత్వం విద్యాసంస్థలను మూసివేసింది. థియేటర్లు కూడా త్వరలోనే మూతబడనున్నాయి అని వార్తలు హల్చల్ చేసాయి. దీనికి సంబంధిన చర్చలు జరిగాయని మరో రెండు రోజుల్లో థియేటర్లు మూసివేయాలని అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ థియేటర్లను మూసివేస్తాం అని వస్తున్న వార్తలను నమ్మొద్దు ఈ విషయమై ఎటువంటి చర్చలు జరగలేదు థియేటర్లు యధావిధిగా కోసగుతాయని అన్నారు. దీంతో థియేటర్ యజమానులతో పాటు ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.