
మామూలుగా స్టార్ హీరో ఫ్యాన్స్ తమ అభిమాన నటుల సినిమాల కోసం ఎలా ఎదురు చూస్తారో తెలిసిందే. బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో సినిమా చేయమని ఫ్యాన్స్ హీరోలని కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ సైతం ఎదురు చూస్తున్న కాంబినేషన్ మహేష్-పూరి జగన్నాథ్ ల కాంబో. సూపర్ స్టార్ మహేష్, డ్యాషింగ్ డైరక్టర్ జగన్నాథ్ ల కలయికలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. 2005 లో వచ్చిన పోకిరి మూవీ హిట్ కొట్టి అప్పటి వరకూ ఉన్న లెక్కల్ని తుడిచి పెట్టేసింది.


ఆ మూవీ సక్సస్ తర్వాత మహేష్ బాబు స్టార్ స్టేటస్ అందుకోగా హీరోయిన్ ఇలియానా, దర్శకుడు పూరి జగన్నాథ్ లకు కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలో పండు అనే పోకిరిగా, కృష్ణ మనోహర్ ఐపీఎస్ గా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకులచే చప్పట్లు కొట్టించుకున్నారు. ఇక ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన మూవీ బిజినెస్ మ్యాన్. క్రైమ్ ని బిజినెస్ గా చేసి ఆర్గనైజ్డ్ క్రైంని నడిపే సూర్య అనే యువకుడి కథగా వన్ మాన్ షో మూవీగా దర్శకడు పూరి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో సూర్య భాయ్ పాత్రలో మహేష్ యాక్షన్, ఫైట్స్, డైలాగ్స్ కి అందరి నుండి మంచి పేరు దక్కింది.

అయితే ఈ రెండు సినిమాల అనంతరం పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజక్ట్ జనగణమణ మూవీలో మహేష్ హీరోగా చేయనున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ దానిపై ఎవరూ స్పందించలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం మహేష్ ని కలిసి స్టోరీ వినిపించిన పూరి అతి త్వరలో వీలుని బట్టి దీనిని పట్టాలెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. కాగా ఈ సినిమాని పూరి, మహేష్ ఇద్దరూ కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.