
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం RRR .. బాహుబలి లాంటి పెద్ద హిట్ తర్వాత ఏ సినిమా చేస్తాడు అన్న దానికి RRR సినిమా అనౌన్స్ మెంట్ అభిమానులకు పెద్ద పండగలాంటిదే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు.ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. చిత్రీకరణ చివరిదశకు వచ్చిందని సమాచారం. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నాడు. కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘టెంపర్'తో మొదలైన అతడి విజయ పరంపర ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వరకూ కంటిన్యూ అయింది.

ఇలా ప్రస్తుత తరంలో ఏ స్టార్ హీరోనూ వరుసగా ఐదు విజయాలను నమోదు చేయలేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేసే పనిలో ఉన్నాడు. త్రివిక్రమ్ తో అరవింద సమేత సినిమా ను చేసిన ఎన్టీఆర్ రెండో సినిమా అయన తో వెంటనే చేయడం విశేషం. ఇంకా ప్రశాంత్ నీల్ సినిమా కూడా లైన్ లో ఉంది.. ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ ఘోర ఓటమి తరవాత... ఈ చర్చలు మరింత తీవ్రతరమయ్యాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఇప్పుడొచ్చిందని, ఎన్టీఆర్ ఈ విషయంలో త్వరగా స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టీడీపీకి... కొత్తరక్తం అందించాలంటే, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే.. ఎన్టీఆర్ పార్టీ జెండా మోయడం తప్పనిసరి. గతంలో కూడా.. పార్టీకి అవసరమైనప్పుడు నా వంతు సేవ చేస్తా
అంటూ... ఎన్టీఆర్ మాటిచ్చాడు కూడా. ఇటీవల ఎన్టీఆర్‌ని రాజకీయ రంగ ప్రవేశం గురించి అడిగినప్పుడు సమాధానం దాటేశాడు. ఇప్పుడు సమయం కాదంటూ... తప్పించుకున్నాడు. నిజానికి ఇదే సరైన సమయం. టీడీపీ ఇప్పుడు దీనావస్థలో ఉంది. ఎన్టీఆర్ లాంటి యువకులు ఈ పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకోవాలి. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉండడం భావ్యం కాదు. అయితే ఎన్టీఆర్ మనసులో చాలా ఆలోచనలు రేగుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి పెద్దలు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి, కీలకమైన బాధ్యతలు అప్పగిస్తే - అప్పుడు టీడీపీ జెండే మోద్దాం.. అని ఎన్టీఆర్ చూస్తున్నాడట. 2024 ఎన్నికలకు ముందు... ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.