అప్పుడు నేషనల్.. ఇప్పుడు ఇంటర్నేషనల్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం ఏదంటే తడుముకోకుండా ఆర్.ఆర్.ఆర్ అని చెబుతాం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజేయ్ దేవగణ్, సముద్రఖని తదితరలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాత్రల తాలూకూ ఫస్ట్ లుక్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో అందరికి తెలిసిందే. దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.

ఆర్.అర్.ఆర్ ఓ.టి.టిలో రిలీజ్ అవుతుంది అని వచ్చిన పుకార్లను ఖండిస్తూ, చిత్రాన్ని థియేటర్ లలోనే విడుదల చేస్తామని ఎన్టీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్, ఓ.టి.టి రైట్స్ సొంతం చేసుకున్న ట్.వి చానల్స్ మరియు ఓ.టి.టిల వివరాలు తెలియజేసారు. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత చిత్రాన్ని తిరిగి ఓ.టి.టిలలో రిలీజ్ చేస్తారు.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలు జీ5లో, హిందీ భాష నెట్ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఇక అలానే స్టార్ చానల్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, ఏషియన్ ప్లానెట్ లో మలయాళం, జీ సినిమాలో హిందీ వెర్షన్ టెలికాస్ట్ అవుతాయి. అలాగే ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, పోర్చుగీస్, కొరియన్, స్పానిష్, టర్కిష్ భాషల్లో కోడా రిలీజ్ చేయనున్నారు. ఈ భాషల స్ట్రీమింగ్ హక్కులని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రంతో ఇప్పటి వరకూ ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయి కొత్త రికార్డ్లు క్రియేట్ అవ్వడం ఖాయం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.