రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ చేతుల మీదుగా ‘రౌడీ బాయ్స్’ సినిమా నుంచి ‘ప్రేమే ఆకాశం.. ’ సాంగ్ విడుదల!!

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో ... శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). బుధవారం ఈ సినిమా నుంచి ‘ప్రేమే ఆకాశం..’ అనే పాట‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా...
విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆశిష్‌, అనుప‌మ‌, డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌కు నాకు ప‌రిచయం ఉంది. వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రౌడీ బాయ్స్ సినిమాలోని సాంగ్ లాంచ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. పెళ్లిచూపులు ముందు నుంచి శ్రీహ‌ర్ష నాకు తెలుసు. హుషారు క‌థ నాకు ముందే చెప్పాడు. యూత్ మీట‌ర్ ప‌ర్పెక్ట్‌గా తెలిసిన ద‌ర్శ‌కుడు. అందుకు ఈ సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని తెలుసు. హుషారు త‌ర్వాత త‌ను చేసిన రౌడీ బాయ్స్ పెద్ద హిట్ కావాలి.

అనుప‌మ మంచి పెర్పామెన్స్‌. మొద‌టి సినిమా అనుభ‌వం చాలా గొప్ప‌గా ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయాల‌ని ఆశిష్‌ను కోరుతున్నాను. త‌ను న‌న్ను క‌లిసిన‌ప్పుడు త‌న‌లోని క్యూరియాసిటీని గ‌మ‌నించాను. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు సామాన్య‌మైన వ్య‌క్తులు కాదు. వాళ్లు గ‌ర్వ‌ప‌డేలా ఆశిష్ సినిమా చేస్తే చాలు. వాళ్లు గ‌ర్వ‌ప‌డేలా గొప్ప న‌టుడిగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. నిజానికి దిల్‌రాజుగారు, శిరీష్‌గారు అస‌లు రౌడీ బాయ్స్. ఎందుకంటే ఎక్క‌డో నిజామాబాద్ నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చి సినీ ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డ్డారు. థియేట‌ర్స్‌, క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్‌.. నిరంత‌రం ఫైట‌ర్స్‌లా ప‌నిచేశారు. ఇప్పుడు ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తున్నారు. నాకెంతో ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చిన వ్య‌క్తులు వాళ్లు. రాజుగారితో మైండ్ బ్లోయింగ్ సినిమా చేయాల‌ని వెయిట్ చేస్తున్నాను. త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తాం. న‌వంబ‌ర్ 19న రౌడీ బాయ్స్ విడుద‌ల‌వుతుంది’’ అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్‌’ ప‌క్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ ఫ‌స్ట్ సాంగ్‌, టీజ‌ర్ చూశారు. సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో ల‌వ్ కంటెంట్ ఎలా ఉంటుంద‌నేది సినిమా చూడాల్సిందే. యూత్‌ఫుల్ మూవీ కావ‌డంతో దీనికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాం. విజ‌య్‌తో నాకు డిఫ‌రెంట్ జ‌ర్నీ ఉంది. కేరింత సినిమాకు ముగ్గురు హీరోల్లో ఒక‌రిగా న‌టించ‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫొటో షూట్‌కు వ‌స్తే, అలా చూసేసి వెళ్లిపోయాను. త‌న‌ను క‌ల‌వ‌లేదు. అలాగే పెళ్లిచూపులు సినిమాను కూడా నాకు చూపించాల‌ని త‌ను ప్ర‌య‌త్నిస్తే నేను ఆస్ట్రేలియాలో హాలీడేస్‌లో ఉన్నాను. తర్వాత త‌ను అర్జున్ రెడ్డితో ఓ క‌ల్ట్ స‌క్సెస్ సాధించాడు. గీతా గోవిందం స‌క్సెస్ త‌ర్వాత ఈవెంట్‌కు వెళ్లిన నేను అక్క‌డకు విజ‌య్ వ‌స్తుంటే వ‌స్తున్న రెస్పాన్స్ చూసి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారికి ఫ్యాన్స్ దొరికారు. త‌ర్వాత మూడు నాలుగు సినిమాల్లో ఆ రేంజ్‌లో యూత్‌ను సాధించాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లా తెలుగు ఇండ‌స్ట్రీకి ఓ యూత్‌ఫుల్ స్టార్ దొరికాడ‌ని చెప్పాను.

లైగ‌ర్‌తో ఇప్పుడు త‌ను పాన్ ఇండియా హీరోగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నాడు. త‌న‌కు ఈ సంద‌ర్భంగా ఆల్ ది బెస్ట్‌. కొంద‌రు త‌ప్పితే ఎక్కువ‌గా కొత్త‌వాళ్ల‌ను ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాం. శ్రీహ‌ర్ష కొత్త‌వాళ్ల‌తో త‌న‌కు కావాల్సిన‌ట్లు సినిమాను డిజైన్ చేసుకున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని ఇచ్చాడు. సినిమాలో ఆరు పాట‌లున్నాయి. అనుప‌మ మా బ్యాన‌ర్లో చేసిన మూడో సినిమా. త‌ను కొత్త అమ్మాయిలా ఒదిగిపోయి యాక్ట్ చేసింది. డేట్స్ అడ్జ‌స్ట్ చేసి ఈ సినిమాను పూర్త‌య్యేలా ఎంతో స‌పోర్ట్ చేసింది. రామ్‌చ‌ర‌ణ్ గారికి ఈ సాంగ్ చూపించాను. త‌ను అనుప‌మ‌ను రిజిష్ట‌ర్ చేసుకోవ‌డానికి టైమ్ తీసుకున్నాడు. అందుకు కార‌ణం.. త‌ను లుక్ వైజ్, యాక్టింగ్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. ఆశిష్ అంద‌రి కుర్రాళ్ల‌లా ఉండాల‌ని కేర్ తీసుకుని సినిమా చేశాం. ఈ సినిమాను ముప్పై రోజుల త‌ర్వాత అంటే.. న‌వంబ‌ర్ 19న ఈ సినిమాను విడుద‌ల చేశాం. ద‌స‌రా అనుకున్నాం. కానీ, పాండ‌మిక్ వ‌ల్ల ఆగిన సినిమాలు చాలా రావ‌డంతో మా రౌడీ బాయ్స్‌ను న‌వంర్ 19న విడుద‌ల చేస్తున్నాం.  పెర్ఫామెన్స్‌, డాన్సులు, ఎంట‌ర్టైన్మెంట్ ప‌రంగా.. యూత్‌ను సినిమాను మెప్పిస్తుంది’’ అన్నారు.
హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘‘బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మా కోసం వ‌చ్చి సాంగ్ లాంచ్ చేసిన విజ‌య‌న్న‌కు థాంక్స్‌. లైగ‌ర్ కోసం మేమందరం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం. అనుప‌మ పెద్ద స్టార్ అయినా ఎంత‌గానో స‌పోర్ట్ చేసింది. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష చాలా మంచి సినిమాను ఇచ్చాడు. త‌న‌కు థాంక్స్‌. మ‌దిగారి వ‌ల్ల ఇంత మంచి విజువ‌ల్స్ వ‌చ్చాయి. న‌వంబ‌ర్ 19న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘‘మా సినిమాలో ప్రేమే ఆకాశం..’  అనే సాంగ్‌ను లాంచ్ చేస్తున్న రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు థాంక్స్‌. హుషారు సినిమా స‌మ‌యంలోనూ ఆయ‌న ఓ సాంగ్ రిలీజ్ చేసి .. ల‌క్కీ ఛార్మ్‌గా నిలిచారు. ఈ సినిమాలో ఆయ‌న రిలీజ్ చేస్తున్న సాంగ్ పెద్ద హిట్ అవుతుంది. దేవిశ్రీ ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. ఆయ‌నకు స్పెష‌ల్ థాంక్స్‌. ఇదొక ల‌వ్ సాంగ్..ఇందులో ఆశిష్‌, అనుప‌మ కెమిస్ట్రీ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటుంది. ఆ క్రెడిట్ అంతా అనుప‌మకే ద‌క్కుతుంది. త‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్‌’’ అన్నారు.
అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడుతూ ‘‘మమ్మల్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండగారికి స్పెష‌ల్ థాంక్స్‌. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఎక్కువ‌గా మాట్లాడుతాను. రాజుగారు, శిరీష్‌గారు స‌హా ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు.
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో తేజ్ కొర్ర‌పాటి, కార్తీక్ ర‌త్నం, ప్ర‌ణీత్‌, కోమ‌లి, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.