
కరోనా వైరస్ ప్రభావం కారణంగా నిలిచిపోయిన షూట్స్ అన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటీ తిరిగి మొదలవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ కథనాయకుడు యష్ కూడా రంగంలోకి దిగారు. యష్ ప్రస్తుతం కేజిఎఫ్ చాప్టర్-2లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ గత నెలే మొదలైనా అందులో యష్ పాల్గొనలేదు. ప్రకాష్ రాజ్ మీద సన్నివేశాలను చిత్రీకరించారు. నేటి నుండి మరో షెడ్యూల్ మొదవలవ్వగా అందులో యష్ జాయిన్ అయ్యారు. సోషల్ మీడియాలో యష్ ఈ విషయాన్నీ తెలియజేసారు. ఈ విషయమై ఆయన ట్విటర్ వేదికగా "అలలను మనం ఆపలేము కానీ వాటిపై ప్రయాణించడం నేర్చుకోవచ్చు. చాలా కాలం తర్వాత రాకీ భాయ్ ప్రయాణం మొదలైంది" అని ట్వీట్ చేసారు. కే.జి.ఎఫ్ లోకి రాకీ భాయ్ పాత్రలో యష్ నటిస్తోన్న విషయం తెల్సిందే. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంజయ్ దత్ అధీరా పాత్రలో కనిపించనున్నారు. రామైకా సేన్ పాత్రలో రవీనా టాండన్ కనిపించనున్నారు
Waves can't be stopped but you can learn to sail..
— Yash (@TheNameIsYash) October 8, 2020
After a long break.. #Rocky sets sail from today.