రాకింగ్ స్టార్ యష్

కె.జి.ఎఫ్ అనే ఒక్క సినిమాతో యష్ దేశమంతా సంచలనం సృష్టించాడు. చాలామందికి యష్ ఈ సినిమాతోనే తెలుసు కానీ ఈ సినిమాకి ముందు యష్ నటజీవితం గురించి ఎవరికీ తెలీదు. ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్ కొడుకు నుంచి  దేశమంతా క్రేజ్ ఉన్న హీరోగా ఎదిగిన నటుడు యష్. నాటకాలు వేసుకునే యష్ ఇప్పుడు సూపర్ స్టార్ అవ్వడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.


జననం

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న భువణహళ్లిలో 1986 జనవరి 8 న అరుణ్ కుమార్ పుష్ప దంపతులకు యష్ జన్మించారు. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. యష్ నాన్న ఆర్టీసీ బస్ డ్రైవర్ గా పని చేసేవారు. యష్ కి నందిని అనే చెల్లి కూడా ఉంది. యష్ స్కూలింగ్ అంతా మైసూర్ లో ఉన్న మహాజనా హై స్కూల్ లో జరిగింది. ఆయన స్కూల్ లో ఉన్నప్పుడే నాటకాల మీద చాలా ఆసక్తిగా ఉండేవారు. దానితో స్కూల్ అయిపోగానే ప్రముఖ నాటక కర్త బి.వి కరన్త్ గారు స్థాపించిన బెనక డ్రామా ట్రాప్ లో చేరాడు. ఆయన ఒక పక్క నాటకాలు వేస్తూనే తన ఇంటర్ చదువుని పూర్తి చేశాడు.

సినీ జీవితం

సీరియల్ డైరెక్టర్ అశోక్ కశ్యప్ ఒకసారి యష్ వేసిన ఒక నాటకాన్ని చూసి ఆయన డైరెక్షన్ చేస్తున్న నందా గోకుల అనే  సీరియల్ లో అవకాశాన్ని ఇచ్చారు. ఈ సీరియల్ ఈ.టీవీ కన్నడలో టెలికాస్ట్ అయ్యేది. ఈ సీరియల్ తర్వాత వెంటనే ఉదయ్ టీవీ లో టెలికాస్ట్ అయ్యే ఉత్తరాయణ అనే సీరియల్ లో యష్ కి అవకాశం వచ్చింది. ఇందులో ముఖ్య పాత్రలో రోజా గారు పోషించారు. ఈ రెండు సీరియల్స్ 2004 లో టెలికాస్ట్ అయ్యాయి. ఆ తర్వాత వరసగా సీరియల్స్ లో నాటకాల్లో యష్ నటించేవారు.

ఒక పక్క సీరియల్స్ చేస్తూ యష్ సినిమాల్లో కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా మొదటిసారి జాంబడబుడిగి అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఇలా మెల్లగా చిన్న పాత్రలు చేస్తున్న యష్ కి డైరెక్టర్ శశాంక్ తీసిన ముగ్గిన మనసు సినిమాలో ముఖ్య పాత్ర ఇచ్చారు.ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే యష్ పాత్రనే సినిమాకి చాలా ముఖ్యం. ఈ సినిమా 2008 లో వచ్చి సూపర్ హిట్ అయింది. ఇందులో హీరోయిన్ గా నటించిన రాధిక పండిట్ తో యష్ ఈ సినిమాతో పరిచయం ఏర్పడింది.

మొగ్గిన మనసు సినిమా హిట్ అవ్వడంతో డైరెక్టర్ నాగేంద్ర యష్ ని హీరోగా పెట్టి రాకీ అనే సినిమాని తీశారు. 2008 లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రాకీ సినిమా హిట్ తో యష్ హీరోగా వెనక్కి తిరిగే చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన కళ్లారా సంతే, గోకుల సినిమాలు కూడా బాగా అడడంతో ఆయనకి మెల్లగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మొదలైంది.

2010లో వచ్చిన మొదలసల సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా స్టార్ హీరోస్ కి వచ్చినట్టు ఓపెనింగ్స్ రావడంతో యష్ స్టార్ హీరో అయిపోయాడు అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన రాజధాని సినిమా సరిగ్గా ఆడలేదు. అదే సంవత్సరం వచ్చిన కిరతక బాగానే ఆడిన కూడా లక్కీ, సినిమా మాత్రం ప్లాప్ అయింది.

అయితే ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యష్ కి డ్రామా సినిమా సూపర్ డూపర్ హిట్ ని ఇచ్చింది. ఈ సినిమా 4 కోట్లతో నిర్మిస్తే విడుదల తర్వాత దాదాపుగా 20 కోట్ల కలెక్ట్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమాలో యష్, రాధిక పండిట్ తో రెండో సారి కలిసి నటించారు. ఈ సినిమాతో వీరి ఇద్దరి మధ్య ప్రేమ మొదలయ్యింది.

ఇక 2013 లో వచ్చిన గూగ్లీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా 100 రోజులు ఆడి 30 కోట్ల వరకు వసూలు చేసింది. ఇవే కాకా ఈ సినిమాకి సాటిలైట్ రైట్స్ హక్కులే 2 కోట్ల వరకు వచ్చాయి. కన్నడ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సంపాదించిన సినిమాల్లో గూగ్లీ ఒకటి.

ఇక ఆ తర్వాత వచ్చిన రాజపులి, గజాకేసరి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక 2014 లో వచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి సినిమా ఆయనికి ఇంకో బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చింది. ఈ సినిమా మొదటిరోజే 3కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అదే సమయంలో వచ్చిన అమీర్ ఖాన్ సినిమా పీకే సినిమాని మించి బెంగుళూరులో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టింది.

ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేసి కన్నడ ఇండస్ట్రీ లోనే చరిత్ర సృష్టించింది. అప్పటిదాకా ఆయన నటించిన హైయెస్ట్ బడ్జెట్ సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో యష్ కి జోడిగా రాధిక పండిట్ మూడోసారి కలిసి నటించింది. ఈ సినిమా షూటింగ్ లోనే రాధిక, యష్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇక 2016లో వచ్చిన సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్ సినిమా మొదలయింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే యష్, రాధిక ఇద్దరు గోవా లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ సినిమా కూడా విడుదలై సూపర్ హిట్ అయింది.

ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన కె.జి.ఎఫ్ సినిమా గురించి అందరికి తెలిసిందే.  2018, డిసెంబర్ 21న కె.జి.యఫ్ సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా విడుదలకి ముందు కన్నడలో భారీ క్రేజ్ ఉన్నప్పటికి  తెలుగు, తమిళం, హిందీల్లో మాత్రం హీరో యష్ ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత అన్ని మారిపోయాయి. ఈ ట్రైలర్ చూసి చాలామందికి సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు ఈ సినిమా రైట్స్ 4 కోట్లకు పైగా పెట్టి సాయి కొర్రపాటి గారు కొన్నారు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత యష్ పేరు దేశమంతా మారుమోగిపోయింది. అప్పటి వరకు చూసిన యాక్షన్ సినిమాల కంటే కూడా కెజియఫ్ ఏదో స్పెషల్‌గా అనిపించింది తెలుగు ఆడియన్స్‌కు. అందుకే యశ్ ఎవరో తెలియకపోయినా కూడా ఆయన స్క్రీన్‌పై కనిపిస్తుంటే విజిల్స్ పడ్డాయి. 4 కోట్లకి కొన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రపంచ వ్యాప్తంగా కెజియఫ్ 240 కోట్లకు పైగా వసూలు చేసింది. కన్నడ ఇండస్ట్రీ అంటే అప్పటి వరకు కూడా తక్కువ అంచనాలే ఉండేవి, కానీ ఈ సినిమా అందరి ఆలోచనల్ని మార్చేసింది. ఈ సినిమా కన్నడలో వచ్చిన మొదటి 100 కోట్లు, మొదటి 150 కోట్లు, మొదటి 200 కోట్ల సినిమాగా చరిత్రని తిరగరాసింది. ఇక ప్రస్తుతం కన్నడలో అత్యంత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా యష్  కొనసాగుతున్నాడు.

వ్యక్తిగత జీవితం

డిసెంబర్ 9, 2016న యష్, రాధిక పండిట్ బెంగుళూరు లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు యథర్వ్, కూతురు ఆర్య అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక యష్ కి ఇంత క్రేజ్ వచ్చాక కూడా, ఆయన తండ్రి ఇంకా ఆర్టీసీలో డ్రైవర్ గానే పనిచేస్తున్నారు.

2017 లో యష్, రాధిక పండిట్ కలిసి యశో మార్గ ఫౌండేషన్ ని స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా కర్ణాటక లోని కోప్పల్ ప్రాంతంలో ఉన్న నీటి సమస్యని 4 కోట్లతో చేరువులని నిర్మించి ప్రజలకి మంచి నీటిని అందిస్తున్నారు.

అవార్డ్స్

2009 లో వచ్చిన మొగ్గిన మనసు సినిమాకి గాను యష్ కి ఉత్తమ సహాయ నటుడుగా ఫిలింఫేర్ అవార్డ్ వచ్చింది. అలాగే 2015 లో వచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి సినిమాకి ఉత్తమ నటుడుగా రెండో ఫిలింఫేర్ అవార్డ్ వచ్చింది. ఇక 2018 లో వచ్చిన కెజిఎఫ్ సినిమాకి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్, సైమ అవార్డ్స్ వచ్చాయి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.