Wishing everyone a very Happy Dussehra! Sending lots of love your way 💕 pic.twitter.com/d8ANQ6evME
— Ritu Varma (@riturv) October 25, 2020
పెళ్ళిచూపులు హీరోయిన్ రీతూ వర్మ మన తెలుగు అమ్మాయి అనే విషయం అందరికీ తెలిసిందే. చూడ్డానికి ఉత్తరాది అమ్మాయిగా కనిపిస్తున్నారు. పెళ్ళిచూపులు చిత్రం తర్వాత కేశవ చిత్రంలో నటించిన ఆవిడ కనులు కనులను దోచాయంటే చిత్రంతో ఈ సంవత్సరం తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తన అందంతో, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పెళ్ళిచూపులు సినిమా తీసుకొచ్చిన క్రేజ్ తో ఎన్నో ఆఫర్స్ ఆవిడను వెతుక్కుంటూ వచ్చాయి. చాలా సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటు తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళ, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు రీతూ వర్మ. స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసుకుంటూ తానేంటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో నటిస్తున్నారు. తాజాగా రవితేజ మరియు రమేష్ వర్మల కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికయ్యారు. దసరా
పండుగ సందర్భంగా అచ్చ తెలుగు చీరకట్టులో ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి తన ఫాలోవర్స్ కి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రీతూ వర్మ. ఈ చీర కట్టులో రీతూ వర్మ చక్కనైన తెలుగు అమ్మాయిగా ఉందంటూ నెటిజన్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.