
పెళ్లి తర్వాత అక్కినేని సమంత సినిమాలు తగ్గించడం ఆమె ఫ్యాన్స్ ని ఎంతగానో నిరాశపరుస్తుంది. నిజానికి పెళ్లి తర్వాత సమంత వరస సినిమాలతో బిజీగా ఉంది.. అయితే ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క సినిమా ఉండడంతో ఆమె ఫాన్స్ ఈ అనుమానాన్ని రేకెత్తిస్తున్నారు.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ఒకటే సమంత చేతిలో ఇప్పుడు ఉంది..

అదే కాకుండా అమెజాన్ ప్రైమ్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో కూడా ఆమె నటిస్తోంది.. స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు లేనప్పుడు స్టార్ హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.. ఎందుకంటే వారికి మంచి మార్కెట్ ఏర్పడడంతో ఆ మార్కెట్ ని సోలో గా క్యాష్ చేసుకుంటారు.. సమంత కూడా అలాంటి ప్రయత్నమే యూటర్న్ సినిమా ద్వారా చేసింది.. కానీ ఆ సినిమా తర్వాత సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాల కి పూర్తిగా దూరంగా ఉంది..

ఇదిలాఉంటే సమంత నటిస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఈ 2021 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు సెకండ్ సీజన్ జూన్ 11వ తేదీన విడుదలవుతుంది తెలుస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ నుండి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇప్పటికే హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ డబ్బింగ్ పనులు కూడ పూర్తయ్యాయట. కాబట్టి జూన్11న పార్ట్2 హిందీలో విడుదలైతే ఇతర భాషల్లో కూడ అదే రోజున రూలీజ్ అవుతుంది. ఈ సెకండ్ సీజన్లో సమంత అక్కినేని ఒక కీలక పాత్ర చేయడం జరిగింది. ఆమె పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.