అతన్ని చంపింది కరోన కాదు వాళ్ళే..!

ఎక్కడ చూసిన కరోన విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది కాని తగ్గట్లేదు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ ఎందరో ప్రాణాలు విడిచారు. ఇక నేడు మాఫియా డాన్ చోటా రాజన్ మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఎయిమ్స్) లో ఆయన చికిత్స పొందుతున్నారు.

ఈ మధ్యాహ్నం ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. చోటా రాజన్ మృతి పై రామ్ గోపాల్ వర్మ “డీ కంపెనీలో రెండో స్థానంలో ఉన్న చోటా రాజన్‌ అని కూడా భయపడకుండా.. కరోనా అతడ్ని చంపేసింది.. ఆయన దాన్ని ఎందుకు షూట్ చేయలేదో నాకింకా అర్థం కావడం లేదు.. దావూడ్ ఇబ్రహీం ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో” అంటూ ట్వీట్ చేశారు. మంచు లక్ష్మీ కూడా దీనిపై ట్వీట్ చేసారు కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మృతి చెందారు.. ఇలాంటి రాక్షసులందరినీ తీసుకుపో కరోనా అంటూ చెప్పుకొచ్చారు.

అయితే రాజన్ చనిపోయాడు అని వస్తున్న వార్తలను డిల్లీ పోలీసులు ఖండించారు. ఆయన ఇంకా చనిపోలేదని చికిత్సకు కోలుకుంటున్నారని వారు అన్నారు. ఈ మేరకు ఆర్జీవి మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. “చోటా రాజన్ గురించి వస్తున్న వార్తలు పుకార్లని తేలిపోయింది. అయితే ఆయన్ను కోవిడ్ కి బదులు పుకార్లు చంపాయి. అతనికి ఆక్సిజెన్ బెదడ్స్ దొరకాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేసారు. దీనికి స్పందిస్తూ నేటిజెన్స్ వింత రిప్లైస్ ఇస్తున్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.