
రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా బద్రి సినిమా చేసిన తర్వాత ఆమె రేంజ్ మాములుగా లేదు. ఆమె పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపొయింది..పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఓ సినిమా లో కూడా నటించారు. జానీ సినిమా లో పవన్ తో పాటు హీరోయిన్ గా నటించి ఇద్దరు బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. అయితే విధి ఆడిన వింత నాటకంలో రేణు దేశాయ్ కి పవన్ కి మధ్య విడాకులు అయ్యింది.. అయితే అప్పటినుంచి ఆమె పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఇండస్ట్రీ లో కొనసాగుతుంది..

అయితే ఆమె ప్రేక్షకులకు మంచి నటిగా కూడా తెలుసు. పవన్ తో విడాకుల తర్వాత ఆమె మరింతగా ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతుంది. పవన్ అభిమానులు కొన్ని సార్లు ఆమెను టార్గెట్ చేస్తూ విమర్శించడం, దానికి ఆమెకూడా ప్రతిఘటించడం వంటివి చేయడంతో ఆమె కూడా వివాదాస్పద మహిళా గా అయిపోయారు.. ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది ఈమె. దర్శకురాలిగానే కాకుండా నటిగానూ నిరూపించుకోడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుంది రేణు దేశాయ్.

తాజాగా పిల్లల గురించి చెప్పి అందరిని ఖుషి చేసింది.. అఖీరా కు తనకు గొడవలవ్వడం ప్రారంభమయ్యిందని చెప్పింది. రోజు వారింట్లో ఏడుగంటలకు పూజ జరుగుతుందని ఆ పూజ కిఎవరు ఎక్కడ ఉన్నా హాజరవ్వాల్సిందేనని కానీ అఖీరా ఈ మధ్య ఆ పూజ కు హాజరవకపోవడం తో తమ మధ్య గొడవలు ప్రారంభవుతున్నాయని చెప్తుంది. అకీరా, ఆద్య కొన్నిసార్లు ఆడుకుంటూ పూజలో పాల్గొడానికి ఇష్టపడరట. ఆ విషయంలో ఇద్దరూ తనతో గొడవపడతారని రేణూ తెలియజేశారు. ఏడున్నరకు పూజ ముగించి, వెంటనే డిన్నర్ చేసి పడుకోవాలనేది రేణూ ఇంటిలో ఉన్న పద్దతి అట.ఇక కొన్నాళ్లక్రితం వరకు పవన్ అంటే రేణూ అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారు. పిల్లలకు తండ్రిగా పవన్ పేరు చెప్పినా ఊరుకునేవారు కాదు. ఈ మధ్య ఆమె పవన్ కి దగ్గిరయ్యారని ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా తెలుస్తుంది.