హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించిన గొప్ప నటుడు

హాస్యానికి కొత్త రంగులు అద్ది తన నటనతో, హావాభావాలతో తెలుగు తెరపై చేరిగిపోని ముద్ర వేసిన ప్రముఖ హాస్య నటుడు, ఎం.ఎస్ నారాయణ. 1994లో మోహన్ బాబు కథానాయకుడిగా వచ్చిన ఎమ్. ధర్మరాజు ఎమ్.ఎ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన ఆయన పెదరాయుడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మా నాన్నకు పెళ్ళి, చూడాలని ఉంది, మావిడాకులు తదితర సినిమాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక అక్కడి నుండి ఆయన వెనుదిరిగి చూసింది లేదు. ఆ తర్వాత స్నేహం కోసం, సమరసింహా రెడ్డి, రాజకుమారుడు, స్వయంవరం, లాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. సుమారు 750 సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.

ఎం.ఎస్ నారాయణ 1951 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రులో అయన జన్మించారు. సినిమాల్లోకి రాకముందు లెక్చరర్ గా పని చేస్తూ థియేటర్ ఆర్టిస్ట్ గా రచయితగా నాటకాలు వేసేవారు. 40 ఏళ్లకు ఇండస్త్రీలోకి అడుగుపెట్టిన ఆయన కేవలం 17 ఏళ్ళలోనే 700 సినిమాల మార్క్ ను చేరుకొని గిన్నిస్ రికార్డ్ ను కైవసం చేసుకునారు. అప్పటి వరకూ ఈ రికార్డ్ బ్రహ్మనందం గారి పేరిట ఉండేది. ఆయన 700 సినిమాలను 20 సంవత్సరాల్లో చేసి అప్పట్లో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోగా దాన్ని ఎం.ఎస్ నారాయణ బద్దలు కొట్టారు.

ఇండస్ట్రీలో దాదాపు అందరితోనూ నటించిన ఆయన అక్కినేని కుటుంబం కలిసి నటించిన మనంలో ముడు తరాల హీరోలతో తెరను పంచుకున్నారు. తనదైన శైలితో తెరపై నవ్వులు పూయించే ఆయన ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. సునీల్ తో ఆయన కెమిస్ట్రీ చాలా సినిమాల్లో బాగా వర్కౌట్ అయింది. కేవలం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. ఇంకా ఎన్నో సినిమాలు చేసి మనందర్నీ నవ్వించాల్సిన ఆయన 2015 జనవరి 23న హఠాత్తుగా మనల్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన్ను తలచుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.