ఈరోజు ఎన్టీఆర్ గారి 25వ వర్థంతి

తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు నందమూరి తారకరామారావు. తెలుగులో దాదాపుగా 400ల సినిమాలకి పైగా చేసిన ఎన్టీఆర్ గారు జనవరి 18 1996లో గుండెపోటుతో మరణించారు. ఆయన చనిపోయినప్పటికీ, ఎన్టీఆర్ గారు తన సినిమాలతో అభిమానుల గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. ఆయన 1982 లో  తెలుగుదేశం పార్టీతో తెలుగునాట సంచలనం సృష్టించారు. పార్టీ పెట్టిన 9 నెలలలోనే తెలుగుదేశం పార్టీని గెలిపించి అప్పట్లో దేశం అంత ఆయన పేరు మాట్లాడుకునేల చేశారు. తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అలాగే స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావు గారికే దక్కుతుంది. అప్పట్లో 7 సంవత్సరాలపాటు ముఖ్య మంత్రిగా పని చేసిన ఎకైక వ్యక్తిగా ఎన్టీఆర్ గారు నిలిచారు. ఆయన్ని తెలుగు ప్రజలంతా అన్నగారు అని పిలవడంతోనే అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రజలకి ఎంత దగ్గరయ్యాడో. సినిమాల్లో ఆయన ఎన్ని సంచలనాలు సృష్టించారో రాజకీయాల్లోనూ అంతే సంచలనానికి కేంద్ర బిందువుగా మారాడు. 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడం లాంటివి ఎన్టీఆర్ గారికి ఎంతో పేరు తెఛ్చి పెట్టాయి. ఇక ఈ రోజు ఆయన వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి ఆయన అభిమానులు, కుటుంబాసభ్యులు వెళ్లి ఆయన సమాధిని దర్శించుకుంటారు

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.