మీ ఘనతకు సరితూగే మాటలు లేవు...

“నువ్విచ్చిన అప్పుకి రాతలూ... కోతలూ ఏమైనా ఉన్నాయా?”, “ఉన్నాయండి. రాతలంటే మా తలరాతలండి.. కోతలంటే మా కడుపు కోతలండి”. ఈ ఒక్క డైలాగ్ చాలు దాసరి గారి నటన ఎలాంటిదో చెప్పడానికి. మేకప్ వేసుకుని కెమెరా ముందుకి వచ్చినా, కలం పట్టి భావాల్ని మన ముందుంచినా ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయన మాటలు పేలే తూటాలు. 150 సినిమాలను పైగా తెరకెక్కించిన దర్శక బ్రహ్మ, కళామాతల్లికే తన జీవితాన్ని అంకితం చేసిన కళాబిపాసి దాసరి నారాయణరావు గారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి ఉద్దండ నటులకి మర్చిపోలేని సినిమాలను అందించిన ఆయన చివరి వరకూ సినిమాలను తీస్తూనే ఉన్నారు. తాతా మనవడు సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ చిత్రం మొదలుకొని ఎన్నో హిట్ సినిమాలను ఆయన తెరకెక్కించారు. ప్రేమాభిషేకం లాంటి ఫీల్ గుడ్ మూవీ అయినా, సర్దార్ పాపారాయుడు లాంటి కమర్షియల్ సినిమా అయినా సరే అవలీలగా తెరకెక్కించే వారు. ఎక్కువగా డ్రామా, మెలోడ్రామా కథలనే ఆయన తెరకెక్కించడం విశేషం. ఆయన సినిమాల్లో కథే మెయిన్ హీరో.

దర్శకుడిగా, నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, ఉదయం వార్తాపత్రిక స్థాపకుడిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేసి మంత్రి వర్గంలో పనిచేసారు. సినీ ప్రస్థానంలో అలుపెరుగని బాటసారిగా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశీలి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చిన తీర్చేవారు. అనారోగ్యం కారణంగా 70 ఏళ్ల వయసులో స్వర్గస్థులయ్యారు. ఆయన జయంతిని పురస్కరించుకుని మా అసోసియేషన్ తరపున యువ ఫౌండేషన్ రక్తదాన సిబిరాలు ఏర్పాటు చేశారు. మా అధ్యక్షుడు నరేష్ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి వేడుకను ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.