తెలుగు వారి ఆత్మగౌరానికి ప్రతీక ఆయన

ఎన్టీ రామారావు అనే పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుబావుడు ఆయన. తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఆయన. యావత్ తెలుగు ప్రజలు ఆరాధించే అన్నగారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చిత్రపరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ముద్రను వేసి, విశ్వనట సార్వభౌముడిగా నందమూరి అనే బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసారు. కేవలం సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రిగా ప్రజల పాలిట దైవంగా ఎదిగిన మహోన్నత వ్యక్తి ఎన్టీ. రామారావు గారు.

నిమ్మకూరులో జన్మించిన ఆయన విజయవాడలో తన చదువును పూర్తి చేసుకున్నారు. గురువుగారైన విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పడంతో నాటకం వేయాల్సి వచ్చింది. ఆయనది నాగమ్మ అనే ఆడ వేషం మీసాలు తీయాలి అని నేను వేషం వేయను అన్నారు. విశ్వనాధ్ గారు వేయాల్సిందే అనడంతో మీసాలతోనే నాటకం వేశారు. అదే మొదటి నాటకం. మీసాలు తీయకుండానే ఆ వేషం వేయడంతో ఆయనకు మీసాల నాగమ్మ అని పేరు పెట్టారు.

చదువు పూరతైన తర్వాత సర్వీస్ కమీషన్ రాసి సబ్-రిజిస్టార్ గా ఉద్యోగం సంపాదించారు. గుంటూర్ లో పోస్టింగ్ అప్పటికే ఆయనకు పెళ్ళైపోయింది. ఆయనకు ఉద్యోగం చేయాలని ఉండేది కాదు సినిమాల్లోకి వెళ్ళని అనుకునేవారు. ముందు ఆర్ధికంగా కొంత స్థిరపడిన తర్వత వెళ్ళొచ్చు అనుకున్నారు కాని అక్కడ పై అధికారుల అవినీతి, లంచగొండితనం ఆయన్ను ఎక్కువ రోజులు ఉంచలేకపోయాయి. అప్పుడే ఉద్యోగం మానేసి ఇంట్లో తన నిర్ణయం అందరికీ చెప్పి మద్రాస్ వెళ్ళి వేషాల కోసం వేటను ఆరంభించారు.

మొదటి సినిమా ఆఫర్ హెచ్. ఎమ్ రెడ్డి గారిది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్క లేదు. ఆ తర్వాత ఎల్.వి ప్రసాద్ గారు చేస్తున్న షావుకారు చిత్రంలో హీరో వేషం వచ్చింది. ఆ చిత్రం కంటే ముందు ఎల్.వి ప్రసాద్ గారు మనదేశం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టేజ్ ఫియర్ పోతుందని ఆ చిత్రంలో చిన్న పోలిస్ వేషం వేయమన్నారు. అక్కడ నుండి ఆయన వెనుదిరిగి వెళ్ళాల్సిన అవసరం రాలేదు. మకుటం మహారాజులా తెలుగు పరిశ్రమను ఏలారు. భారతదేశపు మొదటి సూపర్ స్టార్ ఆయనే అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

ప్రజలు పడుతున్న కష్టాలను చూసి రాజకీయాల్లోకి వచ్చి వారికి సహయం చేయాలనుకున్నారు అప్పటి పరిస్థితుల్లో ప్రతిపక్షమే లేకుండా పోయింది. అప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎనికల్లో పోటి చేసారు. అప్పటి వరకు దక్షిణాది మొహమే చూడని ఇందిరమ్మని కృష్ణ నది నీళ్ళు తాగేలా చేసారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. దేశంలో ఎప్పుడూ ఎక్కడా రాణని మెజారిటీతో తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలను అందించారు. గొప్ప నాయకుడిగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

బహుశ ఆయన పోషించని పాత్ర లేదేమో. పౌరాణికాల్లో అన్ని పాత్రలను అద్భుతంగా పోషించారు. తన నటనతో ఆ పాత్రకు జీవం పోసేవారు. తెలుగు ప్రేక్షకులకు కృష్ణుడు అన్నా, దుర్యోధనుడు అన్నా, కర్ణుడన్నా ఎలాంటి గొప్ప పాత్ర తీసుకున్నా మొదట గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారే. కళా రంగంలో అయన కృషికి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆయనకు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతటి గొప్ప నటుడు మన మధ్య లేకపోవడం నిజంగా మన దురదృష్టకరం. ఆయన జయంతి సందర్భంగా ఆయన్ను తలచుకుందాము.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.