
ఆర్ట్ కు భాషతో సంబంధం లేదు అని బలంగా నమ్మే వ్యక్తి ధనుష్. అందుకే వివిధ భాషల్లో విజయాలు సాధించాడు. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసిన ధనుష్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించాడు. అలాగే ధనుష్ పాడిన ఎన్నో పాటలు బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాయి. పాటలను రాయగలడు, కథలు రాసుకుంటాడు. దర్శకత్వం కూడా చేసాడు. నిర్మాతగా ఇప్పటికే విజయవంతమయ్యారు కూడా. ఇటీవలే అసురాన్ సినిమాకి గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ ను సైతం అందుకున్నాడు

ధనుష్ ప్రధానంగా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ధనుష్ నటించిన కొన్ని సినిమాలు ఇక్కడ రీమేక్ అయితే మరికొన్ని తెలుగులోకి డబ్ అయ్యాయి. హిందీలో రంఝానా, షమితాబ్ లాంటి చిత్రాల్లో నటించి అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం ఆయన రస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ‘ది గ్రే మ్యాన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇంతకుముందు ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ‘ది గ్రే మ్యాన్’ చిత్రంలో రేన్ గాస్లింగ్, క్రిస్ ఇవాన్స్, ధనుష్ లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. షూటింగ్ సందర్భంగా టీమ్ తో ధనుష్ దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ధనుష్ హాలివుడ్ రేంజ్ కి ఎదగడం ఆనందించదగిన విషయం