ఈ భామ కెరీర్ స్లో అవడానికి కారణం అదేనా..?

సినిమా రంగం అదృష్టం మీద ఆధారపడి ఉంటుందనేది అందరి అభిప్రాయం. చాలా మంది విషయంలో ఇది నిరూపితం అయ్యింది కూడా. ఎంతో మంది నటులు బ్లాక్ బస్టర్స్ కొట్టి కూడా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు కెరీర్ స్పాన్ ఇంకా తక్కువగా ఉంటుంది. ప్రతీ ఏడాది పరిశ్రమకు ఎందరో మోడల్స్ పరిచయమవుతారు. వారిలో సక్సస్ బాట పట్టేది ఒకరో ఇద్దరో మాత్రమే. వారు కూడా మహా అయితే 10 లేదా 15 సంవత్సరాలు మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతారు. వారిలో పెళ్ళి అయిన తర్వాత హీరోయిన్ రోల్స్ చేసిన నటీమణులు చాలా తక్కువ.

ఇక ‘కంచె’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ కి మొదటి చిత్రమే హిట్ అవడంతో ఆఫర్స్ బాగా వచ్చాయి కానీ ఆమె చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో ఆమె చివరిగా నటించిన చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుండి ఆమె మరే సినిమా చేయలేదు. రీసెంట్ గా బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కంచే సినిమాతో నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఈ భామకి అవకాశాలు క్యూ కడతాయి అనుకున్నారు అందరూ. నటనతో పాటు అందం కూడా ఆమె ప్లస్ పాయింట్ అని చాలా మంది అభిప్రాయ పడ్డారు. అయితే అందం, అభినయం ఉన్న ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగకపోవడానికి గల కారణం ఒకటేనని వారి అంచనా. కంచే సినిమాలో చీరకట్టుతో కనిపించిన ఈ భామ మిగితా సినిమాల్లో మోడ్రన్ గా కనిపించే సరికి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. మరొక కారణం ఆ సినిమా తర్వాత ఆమె అన్ని చిన్న సినిమాలే చేసింది. దాంతో ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని టాక్.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.