
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. టాక్సీ వాలా ఫేం రాహుల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో ఉప్పెన ఫేం కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్లు గా నటిస్తున్నారు..ఇక అయన నటించిన మరో చిత్రం 'టాక్ జగదీష్' సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమా పై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి.. నాని నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోవడంతో ఈ రెండు సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు..

ఈ రెండు సినిమాలే కాకా నాని 'అంటే సుందరానికి' అనే సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే ఇది చాలా వెరైటీ సినిమా అని చెప్పేశాడు న్యాచురల్ స్టార్.. వెరైటీ చిత్రాల దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే సోషల్ మీడియా న్యాచురల్ స్టార్ నాని శ్రీకారం సినిమా రిజెక్ట్ చేశాడని వార్తలు తెగ వస్తున్నాయి. శర్వానంద్ కంటే ముందుగా శ్రీకారం సినిమా కథ నాని దగ్గరికే వచ్చింది. కొత్త దర్శకుడు కిషోర్ ఈ కథకు నాని అయితే బాగుంటాడని అనుకున్నాడు. అయితే ఆయన ఇతర సినిమాలతో డేట్స్ క్లాష్ కారణంగా నో చెప్పాడని తెలుస్తుంది.

కానీ కథ నచ్చేసరికి తనే తన మిత్రుడు శర్వానంద్‌ను రిఫర్ చేశాడని ప్రచారం జరుగుతుంది. వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు టాక్ బాగానే ఉంది. ఇదనే కాదు కొన్నిసార్లు ఆయన కథలను సరిగ్గా అంచనా వేయలేక వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. అనివార్య కారణాలతో కొన్ని సినిమాలు వదిలేస్తే.. మరికొన్ని డేట్స్ కుదరక వదిలేశాడు. అలా ఇన్నేళ్ళ ఆయన కెరీర్‌లో దాదాపు 10 సినిమాల వరకూ నాని నో చెప్పాడు. నేచురల్ స్టార్ వదిలేసిన సినిమాల్లో చాలా వరకు విజయాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో శ్రీకారం కూడా చేరింది.