
`క్రాక్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తో ట్రాక్ ఎక్కాడు మన మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, ప్రచార చిత్రం సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. రాక్షసుడు లాంటి మంచి హిట్ చిత్రంతో రమేష్ వర్మ కూడా మంచి ఫాంలో ఉన్నారు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాతో పాటు మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. అయన హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజను ఇంతవరకూ చూడని ఒక సరికొత్త పాత్రలో చూపించబోతున్నారు దర్శకుడు శరత్ మండవ. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 1 నుండి హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో టీమ్ అందరూ పాల్గొననున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. రవితేజ ఎనర్జికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్ర స్టోరి ఉందని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న శరత్ దిద వరకు ఎన్నో హిట్ చిత్రాలకు రచయితగా పని చేసారు.