
క్రాక్ హిట్ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రవితేజ తాజగా ఖిలాడీ సినిమా ను మొదలుపెట్టనున్నట్లు వెల్లడించాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగు ఆగిపోయినట్టుగా ఇటీవల వార్తలు షికారు చేశాయి. ప్లానింగ్ లోపం వలన తన డేట్స్ వేస్ట్ అవుతున్నాయనే అసహనాన్ని రవితేజ వ్యక్తం చేసినట్టుగా చెప్పుకున్నారు.

అలాంటి ప్రచారానికి తెరదించేస్తూ ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 26వ తేదీ నుంచి మొదలుకానుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. డిఫరెంట్ లుక్ తో రవితేజ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి కనువిందు చేయనున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, దసరా బరిలో నిలిపే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' రూపొందుతోంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.