
చలో సినిమాతో టాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ తన చక్కటి అభినయంతో ప్రేక్షకులని మంత్ర ముగ్ధుల్ని చేసి వరస హిట్స్ తో దూసుకుపోతోంది. దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, గీతా గోవిందం లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె మెగా హీరోలతో నటించే అవకాశం కొట్టేసింది.
ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున “పుష్ప” సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా లాక్ డౌన్ సడలింపుల తర్వాత సేఫ్టీ మెసర్స్ తో చిత్రీకరణ ఇంకా జరుగుతూ ఉండగానే ఆమె ఇప్పుడు ఇంకొక మెగా ఆఫర్ కొట్టేసింది.
వివారాల్లోకి వెళ్తే, చిరంజీవి “ఆచార్య” సినిమా కొరటాల శివ దర్శకత్వం లో చిత్రీకరణ జరుగుతూ ఉంది. అందులో మెగా పవర్ స్టార్ “రామ్ చరణ్” ఒక అతిధి పాత్ర పోషిస్తున్నట్టు చిరంజీవి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇప్పుడు రామ్ చరణ్ కి జోడీ గా రష్మిక మందాన
ను తీసుకున్నారు. ఒక సినిమా విడుదలకు ముందే మరొక మెగా హీరో తో రష్మిక ఛాన్స్ కొట్టేసి ఫుల్ స్పీడ్ లో ఉంది.