టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు పై బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇద్దరూ కలిసి గత కొన్నేళ్లుగా ప్రముఖ పానీయ సంస్థ థంబ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ వస్తున్నారు. సౌత్ లో మహేష్, నార్త్ లో రణ్వీర్ ఈ సంస్థకు ప్రచారం చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడూ ఇద్దరూ కలిసి నటించిన యాడ్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి నటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో చూడముచ్చటగా ఉంది. ఈ సందర్భంగా మహేష్ ను ఉద్దేశించి రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "నేను చూసిన వారిలో ఫైనెస్ట్ జెంటిల్ మ్యాన్ మహేష్ గారు. మీతో కలిసి పనిచేయడం నాకు గౌరవం. మీతో ఇంటరాక్ట్ అవ్వడం ఎప్పుడూ బాగుంటుంది. లవ్ అండ్ రెస్పెక్ట్ బిగ్ బ్రదర్, మహేష్ గారు" అని రణ్వీర్ సింగ్ పోస్ట్ చేసారు.