
బాహుబలి సినిమాలో బల్లాలదేవుడిగా తాను తప్పా ఎవరు చేయలేరు అన్న రీతిలో దగ్గుబాటి రానా ఆ పాత్రలో ఒదిగిపోయాడు.. ఈ పాత్ర అనే కాదు తాను చేసిన సినిమాల్లోని పాత్రలన్నిటికి వందకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు రానా.. లీడర్ సినిమా తో పరిచయమైన రానా ఒక్క తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా నటిస్తూ అక్కడ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

ఓ సాదా సీదా నటుడిగా మాత్రమే పరిచయమైనా రానా బాహుబలి తో ఇతను మాములు నటుడు ఏం కాదని ఆ సినిమా తో చెప్పేశాడు.. బాహుబలి తో వచ్చిన క్రేజ్ తో ఆ సినిమా తర్వాత రానా చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.. నేనే రాజు నేనే మంత్రి సినిమా అయితే టాలీవుడ్ రికార్డులు తిరగరాసింది అని చెప్పాలి.. ఈ సినిమా తో రానా కి క్రేజ్ మరింత పెరిగిపోయింది. మరి అలాంటి రానా నుంచి ఇప్పుడు మరో పాన్ ఇండియన్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.

విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఆయన అంగీకరించారు. సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది.