రంభ రంభ అంటున్న శర్వానంద్..!!

శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహాసముద్రం.. అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా లో సిద్ధార్థ్ కూడా మరో హీరోగా కనిపిస్తున్నాడు. అదితి రావు హైదరి , అను ఇమ్యానుయేల్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాట విడుదల అయ్యింది. ఇటీవలే ఈ  సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం 'హే రంభ' అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 90వ దశకంలో గ్లామరస్ హీరోయిన్ గా రంభ ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాలో కథా పరంగా జగపతిబాబు .. శర్వానంద్ తదితరులు మాస్ ఏరియాలో ఉంటూ ఉంటారు .. వాళ్లంతా రంభ అభిమానులు. ఫుల్లుగా తాగేసి ఆమె అందచందాలపై పాడుకునే పాట ఇది.

చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకు, భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించాడు. జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. ఇది కేవలం మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన పాట .. తీసిన పాట. జగపతిబాబుతో చాలా రోజుల తరువాత స్టెప్పులు వేయించిన పాట. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.