ఈనాలుగు సినిమాలు చేసుంటే రామ్ చరణ్ కెరీర్ దారుణంగా పడిపోయేది..!!

సినిమా ఇండస్ట్రీ లో హీరోలు కొన్ని సినిమాలను వదులుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. డేట్స్ కుదరకనో, కథ సెట్ అవకనో, కథ నచ్చకనో వేరే ఇతర కారణాలవల్ల సినిమా చేయరు.. అయితే అలా వదిలేసినా కొన్ని సినిమాలు హిట్ అవుతాయి.. ఎక్కువ సినిమాలు ఫ్లాప్ లే అవుతాయి. అలా రామ్ చరణ్ తేజ్ తన కెరీర్ లో వదిలేసినా సినిమాలు చాలావరకు ఫ్లాప్ లే అయ్యాయి. అయన వదిలేసినా సినిమా హిట్ అవడం చాలా తక్కువే అని చెప్పాలి.. చిరుత సినిమా తో పరిచయమైనా రామ్ చరణ్ అతి తక్కువ కాలంలోనే స్టోరీ మీద పట్టు సాధించి హిట్ అయ్యే సినిమాలనే చేసుకుంటూ వచ్చాడు..

అందుకే రామ్ చరణ్ కెరీర్ లో ఫ్లాప్ ల కన్నా హిట్ సినిమాలే ఎక్కువ అని చెప్పాలి. అలా రామ్ చరణ్ దగ్గరికి ఓ నాలుగు కథలు రాగా ఆ సినిమాలు రిజెక్ట్ చేసి తెలివైన పనిచేశావని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం సినిమా పెద్ద గా ఆడలేదు.. ముందుగా ఈ కథ రామ్ చరణ్ వద్దకే వచ్చిందట. కథ నచ్చక ఆ సినిమా ని రిజెక్ట్ చేశాడు రామ్ చరణ్.. ఆ తర్వాత ఈ సినిమా ని దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లు చేశారు.. వారి రేంజ్ కి ఆ సినిమా బాగానే ఆడిన ఆ సినిమా తనకు సెట్ అవడని రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడట..

ఇక గౌతమ్ మీనన్ ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రం కూడా నాని కంటే ముందు రామ్ చరణ్ వద్దకే వచ్చిందట. డైరెక్టర్ రేంజ్ చూసి కొంత ఎక్జిట్ అయిన రామ్ చరణ్ ఆ సినిమా తాను చేయాల్సింది కాదని తప్పుకున్నాడట.. అప్పటికే ప్రేమ కథలు చేసి చేతులు కాల్చుకున్న చరణ్ మళ్ళీ ఆ తప్పు చేయొద్దని నిర్ణయించుకుని ఆ సినిమా కూడా రిజెక్ట్ చేశాడట.. ఇక రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచినా నేలటికెట్టు రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథల్లో ఒకటి కాగా ఇది మంచి నిర్ణయం అంటూ అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.. ఇక మేర్లపాక గాంధీ నానితో చేసిన కృష్ణార్జున యుద్ధం కూడా రామ్ చరణ్ కి అంతగా నచ్చలేదు.. దాంతో ఆ సినిమా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.. ఆ తరువాత నాని తో ఆ సినిమా చేస్తే అది కూడా ఫ్లాప్ అయ్యింది..

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.