
యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్
. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ సందర్భంగా...రామ్ చరణ్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ అయ్యింది. మెగా అభిమానులని ఎంతగానో ఆకర్షించింది.
రామ్ చరణ్ లుక్ పై అభిమానుల్లో చర్చ మొదలైంది. ఈ లుక్ కి 'బీ ది బెస్ట్ పాజిబుల్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్` అని క్యాప్షన్ ఇచ్చిడు.మెగా ఫ్యాన్స్ కి ఈ ఫోటో ఎంతో ఎనర్జీనిచ్చిందని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ ఫోటోని నెటీజన్లు షేర్ చేస్తూ కామెంట్లు ఇస్తూ
రామ్ చరణ్ కి అభినందనలు తెలియజేస్తునే ఉన్నారు.