తమిళ ఇండస్ట్రీ పై కన్నేసిన రామ్ చరణ్..ఆ సినిమా తో..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు..ఈ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుంటే ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తున్నాడు.. బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.. అలియాభట్, ఒలీవియా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. .

పాన్ ఇండియా గా వస్తున్న ఈ సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ గా తెరకెక్కుతుండగా  13 అక్టోబర్ లో ఈ సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. బాహుబలి తర్వాత దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.. ఫ్యాన్ ఇండియా సినిమా గా వస్తున్న ఈ సినిమా  తో పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలనుకుంటున్నాడు చరణ్..

కాగా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రమైన రంగస్థలం తమిళ్ లో విడుదల అవుతుంది.వినికిడి సమస్య ఉండే రోల్ లో నటించి చరణ్ బాక్సాఫీస్ దగ్గర గట్టి రీసౌండ్ తెప్పించాడు.ఒక్క తెలుగులోనే భారీ వసూళ్లను కొల్లగొట్టిన చరణ్ ఈ సినిమాతో ఇతర భాషల్లోకి కూడా వెళ్తున్నాడు. ఆల్రెడీ కన్నడలో విడుదల కాబడిన ఈ చిత్రం తమిళ్ లో కూడా విడుదలకు రెడీ అవుతుంది. మరి ఈ సమయంలోనే తమిళ్ మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం తాలూకా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. మరి తమిళ్ లో ఈ చిత్రం రీసౌండ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సమంతా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.