పెళ్లి తర్వాత ఆ కండిషన్ పెట్టిన రాజీవ్.. కుదరదు అని రెండు సంవత్సరాలు..?

సుమ.. యాంకర్ గా అందరికి సుపరిచయమైన సుమ తన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పింది.. ప్రస్తుతం టాలీవుడ్ లో యాంకర్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది సుమ.. ఏ షో లో చూసినా, ఏ ఆడియో ఫంక్షన్ అయినా సుమ లేనిదే ఆ స్టేజి కి అందం లేదు అన్నట్లు తయారైంది పరిస్థితి.. అందుకే ఆమెను యాంకర్ గా పెట్టుకోవాలని ఎగబడుతుంటారు నిర్వాహకులు..  ఆమె ఏ షో లో ఉంటే ఆ షో లో నవ్వులు పూస్తాయి. కామెడీ పండుతుంది.. వచ్చే పార్టిసిపెంట్స్ కన్నా ఎక్కువ కామెడీ ఈమెనే చేస్తుంది.

అందుకే ఆమెను తమ షో లో పెట్టుకోవడానికి అందరు నిర్వాహకులు ఆసక్తి చూపుతుంటారు. సుమ ఉంటేనే షో హిట్ అవుతుంది అన్న రేంజ్ కి ఆమె క్రేజ్ వెళ్ళిపోయింది..ఇక ఆమె భర్త గురించి చెప్పాలంటే నటుడిగా, విలన్ గా కొన్ని సినిమాల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకున్నాడు రాజీవ్ కనకాల..  సుమ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కాగా అప్పటికే ఆమెకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉండడంతో, యాంకర్ గా అప్పుడే అడుగులు వేస్తూ ఇంత ఎత్తు ఎదిగింది.. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా మారిపోయింది..

తాజగా ఆమె కెరీర్ గురించి, ఆమె పర్సనల్ విషయాల గురించి వెల్లడించింది సుమ.. తనకు సినిమాలంటే ఇష్టమని మొదట్లో యాంకర్ గా కంటే ఆర్టిస్ట్ గా ఉండడమే తనకు ఇష్టమని చెప్పింది.. అయితే పెళ్లి తర్వాత తనని సినిమాలు మానేయమన్నాడు రాజీవ్.. అందుకు నేను ఒప్పుకోలేదు అని చెప్పింది సుమ.. ఆ మాట రాజీవ్ అనడంతో రెండేళ్లు మాట్లాడాలదని, తాను ఎంత ట్రై చేసినా మాట్లాడలేదని చెప్పింది.. ఈ క్రమంలో తాను ఓ రెండు సినిమాలు చేశానని చెప్పింది. కాగా ఆ కల్చర్ తనకు నచ్చక పూర్తిగా సినిమాలకు దూరం గా ఉండాలని అనుకున్నాను. ఆ తర్వాత రాజీవ్ ని అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాను అంది..

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.