
1996 సంవత్సరంలో విడుదలైన ‘పెళ్ళి సందడి’ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ను హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ చేయనున్నారు రాఘవేంద్రరావు గారు. నిన్న ప్రకటించినట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసారు. రాఘవేంద్రరావు గారితో కలిసి ఆర్కా మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని
నిర్మించబోతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా చంద్రబోస్ సాహిత్యం సమకూర్చనున్నారు. శ్రీధర్ సీపాన రచయిత. సంగీతానికి సంబంధించిన పనులు మొదలయ్యాయని ఆయన ప్రకటించారు. ఇక నటీనటులు, ఇతర వివరాలు
త్వరలోనే బయట పెడతామని ప్రకటించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ తోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారు అన్నది ఇంకా తెలియలేదు. అప్పటి పెళ్లి సందడి తరహాలో ఇప్పటి పెళ్లి సందడి ఎంతటి
సందడి చేస్తుందో వేచి చూడాలి.