
రాశి ఖన్నా చీరకట్టులో తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చీరకట్టులో ఎంతో ట్రెడీషన్ లుక్ లో కనిపిస్తూ నెటిజన్ల మనసు దోచేస్తున్నారు. సినిమాని ఎంతో ఫ్యాషన్ గా తీసుకుని తన అందంతో, అభినయంతో వరస ఆఫర్లు దక్కించుకుని ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాశిఖన్నా ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లనే
దక్కించుకున్నారు అని అందరికీ తెలిసిందే. ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత జిల్, శివమ్, బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, జై లవకుశ, రాజా ది గ్రేట్, విలన్, ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం, వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో నటించి బిజీ హీరోయిన్ గా మారిపోయారు. తెలుగు సినిమాలే కాకుండా తమిళ, మళయాళం, హిందీ భాషల్లో కూడా నటించారు రాశి ఖన్నా. చీరకట్టులోని పోటోలని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. తాజాగా మరో ఫోటో షూట్ ని కూడా షేర్ చేసి సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు రాశి ఖన్నా.