'కాత్యాయనిగా' ఆర్.జీ.వి హీరోయిన్:

హృదయ కాలేయం సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సాయి రాజేష్. ఆ సినిమా తర్వాత కొబ్బరి మట్ట, కలర్ ఫోట్ సినిమాలను అమృత ప్రొడక్షన్స్ పై నిర్మించడమే కాకుండా వాటికి రచయితగా కూడా వ్యవహరించారు. కలర్ ఫొటో సినిమా ఆహా ఓ.టి.టిలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా సాయి రాజేష్ తను తీయబోయే కొత్త సినిమా గురించి విశేషాలు బయట పెట్టారు. తను దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా పేరు “కాత్యాయని” ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతోంది. డేరింగ్ అండ్ డేషింగ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘నేక్డ్ నంగా నగ్నం’ అనే అడల్ట్ మూవీలో యాక్ట్ చేసిన శ్రీ రాపాక ఇందులో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని పరమేష్ బొగ్గుల నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్ లో  ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ “శ్రీ రాపాక నాకు పదేళ్ళుగా తెలుసు. చాలా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసింది. నటిగా ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు. రెండు కాలాల వ్యవధుల్లో సాగే కథ ఇది. 1990 లో జరిగే ప్రేమకథకు 2020 లో జరిగే మూడు ప్రేమ కథలకు మధ్య ఎలాంటి పరిణామాలు జరిగాయి…? వాటిని కాత్యాయని ఎలా డీల్ చేసింది? అనేది కథ. టైటిల్ పాత్రలో శ్రీ నటిస్తుంది. భావాద్వేగాలతో నిండిన చక్కటి ప్రేమకథగా ఈ చిత్రాన్నీ చూపించబోతున్నాం. అని దర్శకుడు తెలిపారు. హీరోయిన్ శ్రీ  రాపాక మాట్లాడుతూ “ ఆసక్తి కరమైన కథ, కథనాలతో వినూత్నంగా ఉండే చిత్రమిది, మూడేళ్ళ క్రితమే సాయి రాజష్ నాకు ఈ  కథ చెప్పారు. చలా ఆసక్తి కరంగా ఉంటుంది” అని అన్నారు. మంచి కథ, కథనాలతో రపోందుతున్న ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. త్వర్లో చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు. నిర్మాత పరమష్ బొగ్గుల అన్నారు.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.