అప్పుడు కేవలం కంపెనీ.. ఈ సారి డి కంపెనీ అంటున్నాడు

సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన ఆర్జీవి ఏం చేసినా అది సెన్సేషనే. 90లలో తెలుగు సినిమాని మలుపు తిప్పిన దర్శకుడు ఎవరు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాంగోపాల్ వర్మ. శివ సినిమాతో అప్పటివరకూ ఉన్న రికార్డులు, సినిమాపై ఉన్న అపోహలు ఒక్కసారిగా తొలగిపోయాయి. దర్శకుడు అవ్వాలంటే మినిమమ్ 35 ఏళ్ళు ఉండాలి అనే అపోహను కూడా ఆయన పటాపంచలు చేస్తూ నూతన అధ్యాయానికి తెరతీసారు. శివ మొదలుకుని క్షణక్షణం, సత్య లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని అందించారు.

ఆయన ప్రస్తుతం వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన తన చూట్టూ జరిగే సంఘటనల ఆధారంగా కథలను ఎంచుకుంటుంటారు. ఎక్కువగా క్రైమ్స్ మీద దృష్టి పెట్టే ఆయన దావూద్ ఇబ్రహీం కథపై ఎక్కువగా కాన్సంట్రేట్ చేసినట్లు ఉన్నాడు. 2005లోనే కంపెనీ పేరుతో దావూద్ జీవితాన్ని సినిమాగా తెరకెక్కించారు. ఇప్పుడు మళ్ళీ అతని కథనే సినిమాగా రూపొందించారు. D కంపెనీ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 15న స్పార్క్ ఓ.టి.టిలో విడుదల చేయనున్నట్లు తెలియపరిచారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఆయన షేర్ చేసారు. “ఇది కేవలం ట్రైలర్ మాత్రమె కాదు సినిమా మొదటి 4 నిమిషాలు” అంటూ ట్వీట్ చేసారు.

గ్యాంగ్స్టర్ కథలను తెరకెక్కించడంలో ఆర్జీవి సిద్ధహస్తుడు. సత్య సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫిల్మ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి రేచల్ అనే ఫిల్మ్ క్రిటిక్ సత్య సినిమా భారతీయ పరిశ్రమపై ఒక రెవల్యూషన్ తెచ్చిన సినిమా అని, ఆ సినిమా ఒక కొత్త శైలిని క్రియేట్ చేసిందని అభినందిస్తూ, రాంగోపాల్ వర్మని మాస్టర్ గా ఆమె అభివర్ణించారు. ఆ తర్వాత తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమా కూడా ఘన విజయం సాధించింది. మరి ఈ చిత్రం ఎంత వరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.