
అక్కినేని అఖిల్ తన ఐదో సినిమాకి రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాణం చేశాడు అక్కినేని అఖిల్. ఏజెంట్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు మేకర్స్.. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ వాంటెడ్ బ్యాచ్ లర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే..

ఆయన తొలి మూడు చిత్రాలు యావరేజ్ గా నిలువగా ఈ సినిమా హిట్ అవ్వాలని అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా కోరుతున్నారు.. మాస్ జోనర్ లో అఖిల్ అనే సినిమా చేసిన అఖిల్ కి ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.. దాంతో మళ్లీ లవ్ జోనర్ లోకి వెళ్ళిపోయాడు అఖిల్.. అది కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో ఫామిలీ జోనర్ కి వెళ్ళాడు.. అందుకే బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా చేస్తున్నాడు..

ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఫోర్ డేస్ ప్యాచ్ వర్క్ ఉందట. అన్ని కుదిరితే ఈ నెల 7 నుండి అఖిల్ పై సోలో షాట్స్ తీయనున్నారు. ఇక కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన తరువాత ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాల బాగా వచ్చిందని.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. కాగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.