
అలవైకుంఠపురం లో సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా పుష్ప.. రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్ సబ్జెక్టు చేసి రొటీన్ కి భిన్నంగా సినిమా చేసి హిట్ కొట్టిన సుకుమార్ ఈ సినిమా కి దర్శకుడు.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న మూడో సినిమా అయినా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి..
ఈ చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం, స్మగ్లింగ్, నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.రష్మిక మందన హీరోగా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా బన్నీ ఫ్యాన్స్ అయితే దీన్ని ఇప్పటికీ పండగ చేసుకునే విధంగా చూస్తున్నారు.
ఈ చిత్రంలో ఇటీవలే కొంతమంది కీలక నటులు కూడా యాడ్ అయ్యారు. అయితే వారిలో గ్లామరస్ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. అయితే ఈ చిత్రంలో అనసూయ చేసే రోల్ పైనే ఇంట్రెస్టింగ్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇందులో ఆమెకు సాలిడ్ రోల్ ను సుకుమార్ డిజైన్ చేశారట. గత చిత్రం రంగస్థలం లో ఎమోషనల్ గా ఆమె రోల్ ఉంటే ఈసారి పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. మరి సుకుమార్ ఎలాంటి పాత్రలో అనసూయను చూపించనున్నారో చూడాలి..