
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రం తిరిగి షూటింగ్ మొదలుపెట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా తిరిగి షూటింగ్ మొదలుపెట్టుకోవడంతో బన్నీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈరోజు హైదరాబాద్ లోనే అల్లు అర్జున్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.

ఈ రోజు నుంచి 45 రోజుల వరకూ నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో 'పుష్ప' పార్టు 1కి సంబంధించిన షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. అడవిలోకి చొరబడిన అవినీతి .. అక్కడ జరిగే దౌర్జన్యాలు .. ఎర్రచందనం అక్రమరవాణ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, అల్లు అర్జున్ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి మాలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పరిచయమవుతున్నాడు.