
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీ తో కలిసి పూరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ చేసి అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

పాన్ ఇండియా రేంజ్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిందీ డబ్బింగ్‌ను విజయ్ స్వయంగా చెప్పబోతున్నాడట. ఇందుకోసం భాషపై మరికొంత పట్టు సాధించేందుకు ట్రై చేస్తున్నాడని టాక్. కాగా ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడట.

ఇకపోతే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కన్నడ స్టార్ హీరో ధ్రువ్ సర్జా కలయికలో ఓ సినిమా రాబోతుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా హాల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వీరి కలయికలో సినిమా అనేది దాదాపు ఫిక్స్ అని.. పూరి కథ కూడా రాశాడని.. ఇప్పటికే పూరి, ధ్రువ్ సర్జాకి కథ వినిపించాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమా తెలుగు-కన్నడ- ద్విభాషా చిత్రం అట.